పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘కల్కి 2898 ad’ (Kalki 2898 AD) . అశ్వినీదత్ (C. Aswani Dutt) ఈ చిత్రాన్ని ‘వైజయంతీ మూవీస్’ బ్యానర్ పై తన కూతుర్లు ప్రియాంక దత్(Priyanka Dutt) , స్వప్న దత్ (Swapna Dutt)..లతో కలిసి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. జూన్ 27 న అంటే మరికొన్ని గంటల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ‘బుక్ మై షో’ లో టికెట్ల గురించి పడిగాపులు కాస్తున్నారు. కానీ పెట్టిన వెంటనే హాట్ కేకుల్లా అయిపోతున్నాయి ‘కల్కి..’ టికెట్లు. ఇదిలా ఉండగా..
ఆల్రెడీ కొన్ని చోట్ల ‘కల్కి..’ షోలు పడ్డాయి. సినిమా చూసిన ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. వారి టాక్ ప్రకారం.. ‘కల్కి 2898 ad’ ఫస్ట్ హాఫ్ బాగానే ఉందట. స్లోగా స్టార్ట్ అయినప్పటికీ.. ఒక్కో క్యారెక్టర్ ని రివీల్ చేసిన పద్ధతి బాగుందట. ప్రభాస్ ఎంట్రీ 20 నిమిషాల తర్వాత ఉంటుందట. ప్రీ ఇంటర్వెల్ బ్లాక్ వద్ద వచ్చే విజువల్స్ మంచి హై ఇస్తాయట. ట్విస్ట్ కూడా హైలెట్ గా ఉంటుందని తెలుస్తుంది.
ఇక సెకండాఫ్ స్టార్టింగ్ నుండి మహాభారతానికి సంబంధించిన సీక్వెన్స్..లు వస్తుంటాయట. అలాగే సెకండాఫ్ లో కొంచెం ఎక్కువ పాత్రలు బ్యాక్ టు బ్యాక్ ఎంట్రీ ఇస్తాయట. ఇక క్లైమాక్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని. చాలా సర్ప్రైజ్ ..లు ఆడియన్స్ ని ఫిదా చేస్తాయని తెలుస్తుంది.
కచ్చితంగా ఓ శాటిస్ఫాక్షన్ తో ఆడియన్స్ థియేటర్ నుండి బయటకు వస్తారని అంతా పేర్కొంటున్నారు. మైథలాజికల్ ఎలిమెంట్స్ కనుక కనెక్ట్ అయితే కిడ్స్ ని ఆకట్టుకునే విజువల్స్ ఇందులో బోలెడు ఉన్నాయి కాబట్టి.. బాక్సాఫీస్ వద్ద ‘కల్కి..’ స్ట్రాంగ్ గా నిలబడే అవకాశాలు ఉన్నాయని సినిమా చూసిన వారు చెబుతున్నారు.
Kalki 2898 AD is truly groundbreaking film that set a new benchmark in Indian cinema. movie captivate audiences with their extraordinary blend of mythology and futuristic storytelling. The visuals are nothing short of… pic.twitter.com/eeSgekdaL4
#Kalki2898AD is a larger than life Sci-FI Action Experience. The visuals and world building by Nag Ashwin are never before from Indian Cinema. However, Nag Ashwin shows some inexperience in building a proper drama and emotional connect with somewhat of a flat screenplay.
#KALKI2898AD review :
⭐⭐⭐⭐/5
The dystopian world is stunning to the core . Detailing .
The first half takes us into a roller coaster world where everything is new ✅.
Second half is filled with world-class stunts and VFX
Prabas arc surprise cameos are lit pic.twitter.com/tsiGEGeZh3