విశ్వ నటుడు కమల్ హాసన్ (Kamal Haasan) , లెజెండరీ దర్శకుడు మణిరత్నం (Mani Ratnam) కాంబినేషన్ అంటే అంచనాలు ఆకాశాన్నంటడం సహజం. నాయకన్ తర్వాత దాదాపు 37 ఏళ్లకు మళ్లీ ఈ ఇద్దరూ కలసి థగ్ లైఫ్ (Thug Life) సినిమా కోసం పని చేస్తున్నారు. ఈ చిత్రం జూన్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాలో కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా, శింబు (Silambarasan) , త్రిష (Trisha) , ఐశ్వర్య లక్ష్మి (Aishwarya Lekshmi) , గౌతమ్ కార్తిక్, జోజు జార్జ్ (Joju George), నాజర్ (Nassar), అభిరామి (Abhirami) వంటి స్టార్ కాస్ట్ సందడి చేయనుంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు ఏఆర్ రెహమాన్ (A.R.Rahman) సంగీతం అందిస్తున్నారు.
లేటెస్ట్ గా ఫిక్కీ సౌత్ కాన్‌క్లేవ్ కార్యక్రమంలో కమల్ హాసన్, త్రిష, తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ ( Udhayanidhi Stalin ) తదితరులు పాల్గొన్నారు. సౌత్ సినిమాల ప్రాధాన్యత, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్, సినీ మార్కెట్ విస్తరణ, కథా పద్ధతులు వంటి అంశాలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ప్రేక్షకులు కమల్ హాసన్‌ను థగ్ లైఫ్ సినిమాలో ఆయన పాత్ర గురించి ప్రశ్నించారు. ఈ సినిమాలో ఆయన రంగరాజ్ శక్తివేల్ నాయకర్ అనే గజదొంగ పాత్రలో కనిపించబోతున్నారట.
తన క్యారెక్టర్ గురించి ప్రశ్నించినప్పుడు, కమల్ హాసన్ హుషారుగా, అలాగే కొంత సీక్రెట్‌గా స్పందించారు. “సినిమా చూసిన తర్వాతే మీకది అర్థమవుతుంది. ముందే చెప్పేస్తే మన మణిరత్నం గారు నన్ను ప్రశ్నిస్తారు!” అని నవ్వుతూ సమాధానం ఇచ్చారు. అలాగే, “ఈ పాత్ర పూర్తిగా బ్లాక్ లేదా వైట్ కాదు.. అది గ్రే షేడ్స్ కలిగిన పాత్ర. ఇది మంచి-చెడు పరంగా కాకుండా, ఆ వ్యక్తి పరిసరాల వల్ల ఎలా మారాడో చూపించే కధ” అని క్లారిటీ ఇచ్చారు.
థగ్ లైఫ్ సాంకేతికంగా టాప్ నోచ్ లెవెల్‌లో తెరకెక్కుతుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. మణిరత్నం తన మార్క్ స్క్రీన్‌ప్లే టెక్నిక్స్‌తో సినిమాను రూపొందిస్తున్నారని, ప్రతి సీన్ కూడా ఇన్టెన్స్‌గా ఉండబోతోందని టాక్. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా, జూన్‌లో థియేటర్లలో సందడి చేసే వరకు ప్రతి చిన్న అప్డేట్ కూడా హాట్ టాపిక్ అవుతోంది. మరి కమల్ హాసన్ గజదొంగ అవతారంలో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తారో చూడాలి.