కోలీవుడ్ నటుడు కార్తీ తన సినిమాలతో తెలుగు వారికి కూడా దగ్గరయ్యారు. కొన్ని తెలుగు స్ట్రెయిట్ ఫిలిమ్స్ లో నటించి ఇక్కడి హీరోగా పేరు సంపాదించుకున్నాడు. ఆయన కెరీర్ లో చెప్పుకోదగ్గ సినిమాల్లో ‘ఖైదీ’ ఒకటి. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ ను సాధించింది. చాలా రియలిస్టిక్ గా ఈ సినిమా సాగుతుంది. థ్రిల్లింగ్ కాన్సెప్ట్ తో ఈ సినిమా సాగుతుంది. తమిళ, తెలుగు భాషల్లో ఈ సినిమా పెద్ద హిట్ అయింది.
ఈ సినిమాను హిందీలో అజయ్ దేవగన్ రీమేక్ చేస్తున్నారు. ‘ఖైదీ’ సినిమా విడుదలైనప్పుడే దీనికి సీక్వెల్ ఉంటుందని అన్నారు. హీరో బ్యాక్ గ్రౌండ్ స్టోరీని చూపిస్తూ.. కథను ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంలో దర్శకుడు లోకేష్ కనకరాజ్ ఉన్నారు. ‘ఖైదీ’ టీమ్ మొత్తం కూడా ఎప్పటికప్పుడు ఈ సినిమాకి సంబంధించిన సంకేతాలు ఇస్తూనే ఉన్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ‘ఖైదీ’ సినిమా తరువాత దర్శకుడు లోకేష్ ‘మాస్టర్’ సినిమాను తెరకెక్కించారు.
అలానే ‘విక్రమ్’ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. ఈ రెండు సినిమాలతో లోకేష్ టాప్ లీగ్ లోకి చేరిపోయారు. ఈ క్రమంలో ‘ఖైదీ 2’ సినిమాను భారీగా తీయాలనుకుంటున్నారు. ఈ క్రమంలో కార్తీ అన్నయ్య హీరో సూర్యను కూడా ఈ సినిమాలో ఓ రోల్ కోసం తీసుకున్నట్లు సమాచారం. సూర్య కోసం స్పెషల్ క్యారెక్టర్ ను డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. సీక్వెల్ మాదిరి కాకుండా..
ఈ కథను కొత్త మలుపు తిప్పబోతున్నారని.. పెద్ద స్థాయిలో ఈ సినిమాను రూపొందించబోతున్నారని సమాచారం. ‘ఖైదీ’ సినిమాకి నిర్మాతగా వ్యవహరించిన సురేష్ ప్రభునే ఈ సినిమాను కూడా నిర్మించబోతున్నారు. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియనున్నారు.