డాలీ దర్శకత్వం లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘కాటమరాయుడు’ మార్చి 24 న రిలీజ్ అయి భారీ కలక్షన్స్ రాబడుతోంది. నాలుగురోజుల్లో వందకోట్లకు పైగా గ్రాస్ వసూల్ చేసిన ఈ మూవీ ఓవర్సీస్‌లో ఇంకా కోలుకోలేదు. పవన్ కళ్యాణ్ క్రేజ్ మీదున్న నమ్మకంతో డిస్ట్రిబ్యూటర్లు భారీ మొత్తాన్ని వెచ్చించి ‘కాటమరాయుడు’ ఓవర్సీస్ హక్కుల్ని కొన్నారు. సినిమా మొదటి రోజు ఓపెనింగ్స్ తోనే సగం మొత్తం వెనక్కు వస్తుందనుకున్న డిస్ట్రిబ్యూటర్లకు గట్టి దెబ్బ తగిలింది. నాలుగురోజుల్లో ఈ సినిమా 7 కోట్లు మాత్రమే వసూలు చేయగలిగింది. ఇదేమి తక్కువ మొత్తం కాదు కానీ.. సినిమాను కొన్నది 11. 5 కోట్లకు కావడంతో డిస్ట్రిబ్యూటర్లు తలపట్టుకు కూర్చున్నారు.
వారు గట్టెక్కాలంటే మరో 5 కోట్లు రావాల్సి ఉంది. రేపు ఉగాది అయినప్పటికీ అక్కడ మాత్రం సెలవు ఉండే ప్రసక్తి లేదు. సో వీక్ డేస్ లో ఈ చిత్రం అతి కష్టం మీద ఇంకో 2 కోట్ల వరకు రాబట్టవచ్చు. అయినా నష్టాల నుంచి గట్టెక్కలేరు. తెలుగురాష్ట్రాల డిస్ట్రిబ్యూటర్లకు లాభాలతో ఆనందాన్ని పంచిన కాటమరాయుడు ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లకు మాత్రం నష్టాలని రుచి చూపించబోతున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.