Hero Nani: ‘నాని గారూ మీకు చేతకాకపోతే చెప్పండి.. నేనేంటో చూపిస్తా’.. వైరల్ అవుతున్న వీడియో..!
- December 4, 2022 / 10:55 AM ISTByFilmy Focus
డా. శైలేష్ కొలనుని దర్శకుడిగా పరిచయం చేస్తూ.. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ మీద నేచురల్ స్టార్ నాని సమర్పణలో వచ్చిన ‘హిట్ – ది ఫస్ట్ కేస్’.. యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ ఫిలిం ఆడియన్స్‌ని ఆకట్టుకుంది. ఆ క్యూరియాసిటీ కంటిన్యూ చేస్తూ మరోసారి ప్రేక్షకులకు థ్రిల్ కలిగించడానికి ‘హిట్ – ది సెకండ్ కేస్’ వచ్చేసింది. శేష్ హీరోగా.. ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. మీనాక్షి చౌదరి హీరోయిన్..
ఈ శుక్రవారం (డిసెంబర్ 2)న వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. ఓవర్సీస్ ప్రీమియర్స్ నుండే సాలిడ్ థ్రిల్లర్ అనే టాక్ వచ్చింది.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సూపర్ హిట్ టాక్, హౌస్ ఫుల్ కలెక్షన్లతో దూసుకెళ్తోంది.. ‘హిట్’ సిరీస్ సీక్వెల్ అయిన ‘హిట్ 2’ సీట్ ఎడ్జ్ థ్రిల్లర్.. లాస్ట్ వరకు సస్పెన్స్ క్రియేట్ చేస్తూ.. ఆడియన్స్‌ని ఎంగేజ్ చేసిన విధానం బాగుంది అంటూ ప్రశంసిస్తున్నారు. ఇక సినీ ప్రముఖుల నుండి కూడా టీంకి విషెస్ వెల్లువెత్తుతున్నాయి.

నాని, శేష్ కలిసి సక్సెస్‌ని సెలబ్రేట్ చేసుకున్న పిక్స్, వీడియో వైరల్ అవుతున్నాయి.. ఇదిలా ఉంటే.. ప్రసాద్ ఐమాక్స్‌లో సినిమా చూసిన ఓ లేడీ ఫ్యాన్ పబ్లిక్ టాక్ చెప్తూ చేసిన కామెంట్స్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.. హీరో శేష్ కూడా ఈ వీడియో షేర్ చేస్తూ.. ‘‘చంపినా చంపేస్తుంది కానీ థియేటర్లో’’ అంటూ కామెంట్ చేశారు.. ఆమె ‘హిట్ 3’ గురించి నానికి సజెషన్‌తో పాటు చిన్న వార్నింగ్ కూడా ఇచ్చింది.. ‘‘హిట్ 3’ మూవీలో అబ్బాయిలు చచ్చిపోవాలి..

నెక్స్ట్ అమ్మాయే సీరియల్ కిల్లర్‌గా ఉండాలి.. నాని గారూ ‘హిట్ 3’ తీసేది మీరే కాబట్టి.. ‘హిట్ 3’ లో అమ్మాయి సీరియల్ కిల్లర్‌గా ఉండాలి.. మీకు చేతకాకపోతే చెప్పండి.. నేను ఆ మహేష్ గాణ్ణి మర్డర్ చేసి.. సీరియల్ కిల్లర్ ఎలా ఉంటుందో నేను చూపిస్తా’’.. అంటూ కామెంట్స్ చేసింది.. ఈ వీడియోకి చివర్లో జూనియర్ ఎన్టీఆర్ ‘అదుర్స్’ లో చారి డైలాగ్ యాడ్ చేసి.. ‘‘ట్రూ ఫెమినిస్ట్’’ అంటూ తెగ ట్రెండ్ చేస్తున్నారు నెటిజన్లు..
Champina Champesthundhi…kaani Theater lo. #HIT2 https://t.co/yynfGDV7pI
— Adivi Sesh (@AdiviSesh) December 3, 2022
My Career best opening. ❤️ #HIT2 is a #BloodyBlockbuster
Thanks to you all
Have you seen it yet?
– https://t.co/JrgmMcGqO2
– https://t.co/SPVUTbzLfI@NameisNani @KolanuSailesh @Meenakshiioffl @tprashantii @walpostercinema pic.twitter.com/hjcGkYMY5E— Adivi Sesh (@AdiviSesh) December 3, 2022
❤️ bro @iSumanth #HIT2 https://t.co/iQPGYOSTNj
— Adivi Sesh (@AdiviSesh) December 2, 2022
హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!
ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!














