నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) హీరోగా ఫేడౌట్ అయిపోయారు అని అంతా అనుకుంటున్న టైం ‘సింహా’ అనే బ్లాక్ బస్టర్ ఇచ్చి ఆదుకున్నారు బోయపాటి శ్రీను (Boyapati Srinu). ఆ తర్వాత వీరి కాంబినేషన్లో ‘లెజెండ్’ (Legend) అనే పొలిటికల్ అండ్ మాస్ ఎంటర్టైనర్ కూడా వచ్చింది. 2014 మార్చి 28న ఈ సినిమా రిలీజ్ అయ్యింది. ’14 రీల్స్ ఎంటర్టైన్మెంట్’ సంస్థ పై రామ్ ఆచంట (Ram Achanta), గోపీచంద్ ఆచంట (Gopichand Achanta), అనిల్ సుంకర (Anil Sunkara) సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. రాధికా ఆప్టే (Radhika Apte) , సోనాల్ చౌహాన్ (Sonal Chauhan) హీరోయిన్లుగా నటించగా దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) సంగీతం అందించారు.
ఈ చిత్రంతో సీనియర్ హీరో జగపతి బాబు (Jagapathi Babu) విలన్ గా మారారు.బాలయ్య – జగపతి బాబు మధ్య వచ్చే సన్నివేశాలు మాస్ ఆడియన్స్ కి అమితంగా నచ్చేశాయి. నేటితో ఈ సినిమా విడుదలై 11 ఏళ్ళు పూర్తి కావస్తోంది.దీంతో ‘ #11YearsForBlockBusterLegend’ ‘Legend’ అనే హ్యాష్ ట్యాగ్లు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఈ క్రమంలో ఈ సినిమా బాక్సాఫీస్ కలెక్షన్స్ ను ఓ లుక్కేద్దాం రండి :
నైజాం | 9.41 cr |
సీడెడ్ | 8.40 cr |
ఉత్తరాంధ్ర | 3.68 cr |
ఈస్ట్ | 2.25 cr |
వెస్ట్ | 2.21 cr |
గుంటూరు | 4.14 cr |
కృష్ణా | 2.30 cr |
నెల్లూరు | 1.70 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 34.09 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 4.75 cr |
ఓవర్సీస్ | 1.55 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 40.39 cr (షేర్ |
‘లెజెండ్’ (Legend) చిత్రం రూ.32 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ సినిమా రూ.40.39 కోట్ల షేర్ ను రాబట్టింది. మొత్తంగా బయ్యర్స్ కి ఈ సినిమా రూ.8.09 కోట్ల ప్రాఫిట్స్ ను అందించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది.