అంచనాలు పెంచేస్తున్న ‘లవ్ స్టోరీ’ ట్రైలర్..!

నాగ చైతన్య, సాయి పల్లవి… హీరో, హీరోయిన్లుగా ఫీల్ గుడ్ సినిమాల దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన మూవీ ‘లవ్ స్టోరి’. ఈ చిత్రాన్ని ‘శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ’, ‘అమిగోస్ క్రియేషన్స్’ సంస్థల పై కె నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు లు కలిసి నిర్మిస్తున్నారు. రాజీవ్ కనకాల, ఈశ్వరీ రావు, దేవయాని వంటి నటీనటులు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం సెప్టెంబర్ 24న థియేటర్లలో విడుదల కాబోతుంది.ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లలో విడుదలవుతున్న ప్రెస్టీజియస్ మూవీ ఇదే కావడం విశేషం.

రేవంత్(నాగ చైతన్య), మౌనిక(సాయి పల్లవి)ల ప్రేమ కథను తెర పై చూడాలని ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో వేచి చూస్తున్నారు.ఇప్పటికే విడుదల చేసిన పాటలు, టీజర్ సూపర్ హిట్ అయ్యాయి. ఇక ప్రమోషన్లలో భాగంగా కొద్దిసేపటి క్రితం ట్రైలర్ ను కూడా విడుదల చేశారు.రేవంత్(నాగ చైతన్య) ఓ డ్యాన్స్ స్కూల్ పెట్టుకోవడానికి లోన్ కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నాడు.మరోపక్క మౌనిక(సాయి పల్లవి) సాఫ్ట్ వేర్ జాబ్ కొట్టడానికి చాలా అవస్థలు పడుతూ ఉంటుంది. అనుకోకుండా హీరో, హీరోయిన్ల మధ్య పరిచయం ఏర్పడడం.. హీరోయిన్లో ఉన్న డ్యాన్స్ ట్యాలెంట్ ను వాడుకోవడానికి హీరో ప్రయత్నిస్తూ ఉండడాన్ని ట్రైలర్లో చూపించారు.’బిల్ గేట్స్ వచ్చి ప్రభుదేవా తాన జాబ్ అడిగితే ఏం చేస్తాడు..

దొబ్బెయ్ అంటాడు’ వంటి డైలాగ్స్ యూత్ ను బాగా అట్రాక్ట్ చేసే విధంగా ఉన్నాయనే చెప్పాలి. నాగ చైతన్య, సాయి పల్లవి ల నటన.. కచ్చితంగా ఆకట్టుకునే విధంగా ఉంటుందని ట్రైలర్ స్పష్టం చేసింది. అంతేకాకుండా.. ట్రైలర్ కు పవన్ సి.హెచ్ అందించిన నేపధ్య సంగీతం,సినిమాటోగ్రాఫర్ విజయ్ సి.కుమార్ అందించిన విజువల్స్ హైలెట్ గా నిలిచాయని చెప్పొచ్చు. ట్రైలర్ ఆకట్టుకునే విధంగానే ఉంది. ఇంకా చెప్పాలి అంటే సినిమా పై అంచనాలు పెంచే విధంగానే ఉందని చెప్పాలి. మీరు కూడా ఓ లుక్కేయండి :

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!


టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Share.