విశాల్ (Vishal)హీరోగా అంజలి (Anjali), వరలక్ష్మీ శరత్ కుమార్ (Varalaxmi Sarathkumar) హీరోయిన్లుగా తెరకెక్కిన ‘మదగజరాజ’ (Madha Gaja Raja) 12 ఏళ్ళ తర్వాత తమిళంలో 2025 సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యింది. ఊహించని విధంగా ఈ సినిమా అక్కడ సూపర్ హిట్ అయ్యింది. బాక్సాఫీస్ వద్ద రూ.50 కోట్ల పైనే వసూళ్లు సాధించి సంచలనం సృష్టించింది. తెలుగులో జనవరి 31న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సంతానం (N. Santhanam) ,మనోబాల… కామెడీ వర్కౌట్,హీరోయిన్ల గ్లామర్ వంటివి బి,సి సెంటర్ ఆడియన్స్ ని అలరించే విధంగా ఉండటంతో తెలుగులో కూడా ఈ సినిమా మంచి వసూళ్లు సాధిస్తుంది అని అంతా భావించారు.
Madha Gaja Raja Collections:
కానీ తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా పెద్దగా సత్తా చాటడం లేదు అనే చెప్పాలి. ఒకసారి (Madha Gaja Raja) 6 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
‘మదగజరాజ’ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.2.2 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.2.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. కానీ 6 రోజులు ముగిసేసరికి ఈ సినిమా కేవలం రూ.0.79 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి మరో రూ.1.71 కోట్ల షేర్ ను రాబట్టాలి. కొత్త సినిమాలు కూడా వస్తున్నాయి కాబట్టి.. తెలుగులో ‘మదగజరాజ’ బ్రేక్ ఈవెన్ అవ్వడం కష్టంగానే కనిపిస్తుంది.