మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన చరణ్ మొదటి చిత్రం.. ‘చిరుత’ తోనే స్టార్ హీరోల లిస్ట్ లో చేరిపోయాడు. అటు తరువాత అతని నటించిన రెండవ చిత్రం ‘మగధీర’. దర్శకధీరుడు రాజమౌళి దీనికి దర్శకుడు. నిజానికి చరణ్ ఫస్ట్ ప్రాజెక్టుగా ఇదే సెట్ అయ్యింది కానీ స్క్రిప్ట్ ఫైనల్ అవ్వడంతో డిలే అయ్యింది.ఇప్పుడు వీరి కాంబినేషన్లో ‘ఆర్.ఆర్.ఆర్’ కూడా రూపొందుతోంది. ఇక ‘మగధీర’ చిత్రాన్ని ‘గీతా ఆర్ట్స్’ సంస్థ పై అల్లు అరవింద్ గారు భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఆ టైంకి టాలీవుడ్లో హైయెస్ట్ బడ్జెట్ తో రూపొందిన చిత్రంగా ‘మగధీర’ రిలీజ్ కు ముందే రికార్డ్ సృష్టించింది. 2009 వ సంవత్సరం జూలై 31న విడుదలైన ఈ చిత్రం అప్పటి వరకు ఇండస్ట్రీ హిట్ గా చలామణి అవుతున్న ‘పోకిరి’ రికార్డులను బద్దలు కొట్టి.. ఆ స్థానాన్ని దక్కించుకుంది. ఈరోజుతో ‘మగధీర’ రిలీజ్ అయ్యి 12 ఏళ్ళు పూర్తికావస్తోంది.
మరి ఈ ఇండస్ట్రీ హిట్ మూవీ.. బాక్సాఫీస్ వద్ద ఎంత కలెక్ట్ చేసిందో ఓ లుక్కేద్దాం రండి :
నైజాం
22.20 cr
సీడెడ్
13.00 cr
ఉత్తరాంధ్ర
5.90 cr
ఈస్ట్
4.32 cr
వెస్ట్
4.13 cr
గుంటూరు
5.18 cr
కృష్ణా
3.63 cr
నెల్లూరు
3.30 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
61.66 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా
8.30 cr
ఓవర్సీస్
3.50 cr
తెలుగు వెర్షన్ (టోటల్)
73.46 cr
తమిళ్+మలయాళం
4.50 cr
వరల్డ్ వైడ్(టోటల్ అన్ని వెర్షన్లు కలిపి)
77.96 cr
‘మగధీర’ చిత్రానికి కేవలం రూ.40.42 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం రూ.77.96 కోట్ల షేర్ ను రాబట్టి.. ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.ఈ చిత్రాన్ని కొనుగోలు చేసిన బయ్యర్లకు రూ.37.54 కోట్ల భారీ లాభాలు దక్కాయి.