స్టార్ హీరో మహేష్ నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా 2020 సంవత్సరంలో విడుదలైంది. గతేడాది మహేష్ హీరోగా నటించిన ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు. 2022 సంవత్సరంలో సంక్రాంతి కానుకగా సర్కారు వారి పాట రిలీజవుతుందని ఫ్యాన్స్ భావించారు. అయితే వేర్వేరు కారణాల వల్ల ఈ సినిమా సంక్రాంతి రేసు నుంచి సమ్మర్ కు షిఫ్ట్ అయింది. ఆచార్య రిలీజ్ డేట్ ఏప్రిల్ 1వ తేదీకి ఫిక్స్ కావడంతో సర్కారు వారి పాట మరోసారి వాయిదా పడిందని తెలుస్తోంది.
ఈ సినిమా రిలీజ్ మరింత ఆలస్యం అవుతుందని జరుగుతున్న ప్రచారం మహేష్ అభిమానులను నిరాశకు గురి చేస్తోంది. ఈ గాసిప్ వల్ల మహేష్ అభిమానులు టెన్షన్ పడుతున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం వైజాగ్ లో జరుగుతోందని సమాచారం. స్క్రిప్ట్ లో మహేష్ లేని సీన్లు ఎక్కువగా లేకపోవడంతో మహేష్ సూచనల మేరకు దర్శకుడు స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేశారని సమాచారం. మరోవైపు మార్చి తర్వాత త్రివిక్రమ్ సినిమాకు డేట్లు ఇస్తానని మహేష్ బాబు మాట ఇచ్చారని తెలుస్తోంది.
సర్కారు వారి పాట ఆలస్యమైనా మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమాను మాత్రం ఆలస్యం చేయకూడదని భావిస్తున్నారని తెలుస్తోంది. దర్శకుడు పరశురామ్ వేగంగా ఈ సినిమాను పూర్తి చేయాలని భావిస్తున్నారని తెలుస్తోంది. సర్కారు వారి పాట ప్రమోషన్స్ ను మొదలుపెట్టకపోవడానికి సినిమా రిలీజ్ వాయిదా పడటమే కారణమని సమాచారం. మరోవైపు ఈ నెల 26వ తేదీన ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజయ్యే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది. వైరల్ అవుతున్న ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.
మహేష్ బాబుకు సర్జరీ రావడం, కరోనా సోకడం వల్ల ఈ సినిమా షూటింగ్ పై ఎఫెక్ట్ పడుతోంది. తాజాగా మహేష్ బాబుకు కరోనా నెగిటివ్ వచ్చింది. సర్కారు వారి పాట సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండగా సంక్రాంతికి ఈ సినిమా నుంచి పోస్టర్ కూడా రిలీజ్ కాకపోవడంతో మహేష్ అభిమానులు ఫీలయ్యారు.