మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో అతడు, ఖలేజా సినిమాలు తెరకెక్కగా ఈ రెండు సినిమాలలో అతడు సినిమా సక్సెస్ సాధిస్తే ఖలేజా సినిమా అంచనాలను అందుకోలేదు. ఆ తర్వాత వేర్వేరు కారణాల వల్ల మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో సినిమా రాలేదనే సంగతి తెలిసిందే. అయితే గతేడాది మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబోలో మరో సినిమాకు సంబంధించి ప్రకటన వెలువడింది. అయితే ఈ సినిమా షూటింగ్ అంతకంతకూ ఆలస్యం కావడం గురించి ఫ్యాన్స్ నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోంది.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి రిలీజ్ డేట్ ను ప్రకటించగా ఆ సమయానికి ఈ సినిమా రిలీజ్ కావడం కష్టమేనని తెలుస్తోంది. మరోవైపు మహేష్ సైతం త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పటికీ స్క్రిప్ట్ పనులను పూర్తి చేయకపోవడంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది. మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమా థియేటర్లలో విడుదలై నాలుగు నెలలైంది. మహేష్ తర్వాత సినిమా రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కాల్సి ఉండగా మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీ ఆలస్యమైతే
మహేష్ రాజమౌళి కాంబో మూవీ కూడా ఆలస్యమయ్యే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. త్రివిక్రమ్ సినిమాను వీలైనంత వేగంగా పూర్తి చేయాలని మహేష్ భావిస్తున్నారని బోగట్టా. మరోవైపు మహేష్ బాబు కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ప్రతి ప్రాజెక్ట్ కచ్చితంగా సక్సెస్ సాధించేలా మహేష్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఒకవైపు యాడ్స్ లో నటిస్తూనే మరోవైపు వరుస సినిమాలలో నటిస్తూ మహేష్ కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటున్నారు.
మహేష్ బాబు ఒక్కో సినిమాకు 60 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. సినిమాసినిమాకు మహేష్ బాబు రెమ్యునరేషన్ పెరుగుతుండటం గమనార్హం. రాజమౌళి సినిమా తర్వాత మహేష్ బాబు ఏ డైరెక్టర్ డైరెక్షన్ లో నటిస్తారో చూడాల్సి ఉంది.