ప్రతి రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటుండగా గత దశాబ్ద కాలంలో ఎంటర్టైన్మెంట్ రంగం సైతం అనేక కొత్త పుంతలు తొక్కింది. ఏళ్లుగా వినోద సాధనంగా ఉన్న సినిమా అనేది అన్ని వస్తువులు మాదిరి నేరుగా ఇంటికే చేరుతుంది. థియేటర్స్ కి కుటుంబ సమేతంగా వెళ్లి ఓ మూవీ చూసే రోజులకు ఎప్పుడో కాలం చెల్లింది. ఓ టి టి ప్లాట్ ఫార్మ్స్ అభివృద్ధితో ఇంటిల్లపాది ఇష్టం వచ్చిన సినిమా ఇంటిలో కూర్చొని చూసే పరిస్థితి ఏర్పడింది.
రెండు మూడు వారాలలో ఎంత పెద్ద సినిమా ఆయిన నెట్ ఫ్లిక్స్, అమెజాన్, సన్ నెక్స్ట్, హాట్ స్టార్ వంటి డిజిటల్ మాద్యమాలలో అందుబాటులోకి వస్తున్నాయి. అందుకే టాలీవుడ్ లోని బడా ప్రొడ్యూసర్స్ గా ఉన్న అల్లు అరవింద్, దిల్ రాజు, సురేష్ బాబు వంటివారు ఈ దిశగా అడుగులు వేస్తున్నారు. అల్లు అరవింద్ ఇప్పటికే ఆహా పేరుతో ఓ ఓ టి టి ప్లాట్ ఫార్మ్ స్థాపించారు. కాగా ఈ రంగంలోకి సూపర్ స్టార్ మహేష్ బాబు అడుగుపెట్టాలని చూస్తున్నారట.
ఆయన కూడా నెట్ ఫ్లిక్స్, అమెజాన్ మాదిరి ఓ డిజిట్ల ప్లాట్ ఫార్మ్ మొదలుపెట్టే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. దీనికి సంబందించి గ్రౌండ్ వర్క్ కూడా ఆయన స్టార్ట్ చేశాడట. త్వలోనే మహేష్ దీనిని అధికారికంగా మొదలుపెడతాడట. ఇప్పటికే మహేష్ హంబుల్ కో బ్రాండ్ నేమ్ తో గార్మెంట్ బిజినెస్ చేస్తున్నారు. అలాగే ఏషియన్ సినిమాస్ తో కలిసి మల్టీప్లెక్స్ బిసినెస్ లో ఉన్నారు. ఇలా మహేష్ ట్రెండ్ కి తగ్గట్టుగా వ్యాపారులు చేస్తున్నారు.