సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగానే కాకుండా అనేక వ్యాపార సంస్థలకు ప్రచార కర్తగా మహేష్ బాబు పనిచేసారు. పనిచేస్తున్నారు. ఇక నుంచి సూపర్ స్టార్ కు చెందిన వ్యాపారాలను చూడనున్నాం. ఎందుకంటే మహేష్ బాబు రీల్ లైఫ్ లో బిజినెస్ మ్యాన్ మాత్రమే కాదు రియల్ లైఫ్ బిజినెస్‌మేన్‌గా మారారు. సినిమాలను నిర్మించడమే కాకుండా, ప్రిన్స్ పలు వ్యాపారాలను నిర్వహించడానికి సిద్దమయ్యారు. ఇప్పటికే మహేష్ బాబు ప్రొడక్షన్స్ స్థాపించి సినిమాల నిర్మాణంలో భాగం పంచుకుంటున్నారు. ఇప్పుడు ఆ సినిమాలు ప్రదర్శితమయ్యే మల్టీ ఫ్లెక్స్ వ్యాపారంలో అడుగు పెట్టబోతున్నారు.
ఏషియన్ సినిమాస్ అధినేత సునీల్ నారంగ్ తో కలిసి మహేష్ ఈ కొత్త బిజినెస్‌లోకి దిగారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 25 మల్టీప్లెక్స్ లు నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారు. ముందుగా హైదరాబాద్ లోని గచ్చిబౌలి ఏరియాలో ఏ ఎమ్ బి సినిమాస్ పేరుతో మల్టీ ఫ్లెక్స్ థియేటర్ అందుబాటులోకి రానుంది. సాంకేతిక హంగులతో రూపుదిద్దుకుంటున్న ఈ థియేటర్లలో అత్యంత సౌకర్యవంతగా సినిమా చూసే అవకాశం కల్పించారు. దసరాకి ఈ మల్టీ ఫ్లెక్స్ ఆరంభం కానుందని సమాచారం. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు చేస్తున్న “మహర్షి” సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.