టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. డైరెక్టర్స్ హీరో అని అందరూ అంటుంటారు. నిజమే అతను డైరెక్టర్స్ హీరోనే..! ఒక్క విషయంలో తప్ప. అది ఎందులోనో ఈపాటికే మీకు ఓ ఐడియా వచ్చేసి ఉండొచ్చు. ఎస్.. సంగీత దర్శకుడి విషయంలో..! అవును ఈ విషయంలో మాత్రం మహేష్ చెప్పినట్టే దర్శకుడు, నిర్మాత వినాలి..! మ్యూజిక్ సక్సెస్ అయితే సినిమా సక్సెస్ అయినట్టే అని మహేష్ బలంగా నమ్ముతాడు. కానీ ఈ విషయంలో కొన్ని గుడ్డి నమ్మకాలను కూడా అతను బలంగా నమ్ముతాడు.
మొదట్లో మహేష్ సినిమాలకు మణిశర్మనే సంగీతం అందించేవాడు. అతన్ని తప్ప వేరే సంగీత దర్శకుడిని తన ప్రాజెక్టులోకి రానిచ్చేవాడు కాదు. ‘ఖలేజా’ వరకు అదే పద్దతిని ఫాలో అయ్యాడు మహేష్. అయితే ‘దూకుడు’ సినిమా సూపర్ హిట్ అవ్వడం మణిశర్మని పక్కన పెట్టేశాడు. ‘పోకిరి’ తర్వాత మహేష్ పని ఇక అయిపోయింది అనుకున్న టైంలో ‘దూకుడు’ హిట్ అయ్యి మహేష్ కు స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చింది. ఈ క్రమంలో తర్వాతి సినిమా పూరి దర్శకత్వంలో చేయాల్సి వచ్చింది.
అదే ‘బిజినెస్ మెన్’. ఈ సినిమాకి దర్శకుడు పూరి.. రఘుకుంచెని సంగీత దర్శకుడిగా తీసుకుందాం అనుకున్నాడు. కానీ మహేష్ అతన్ని వద్దు అని చెప్పాడట. తమన్ నే సంగీత దర్శకుడిగా ఎంపిక చేసుకోమని గట్టిగా చెప్పాడట. దీంతో చేసేదేమి లేక తమన్ ను పెట్టుకున్నారు. ఈ సినిమాకి తమన్ మంచి ఔట్పుట్ ఇచ్చాడు.
కానీ పూరికి.. స్నేహితుడుని బాధపెట్టిన ఫీలింగ్ ఉండటంతో ఆ తర్వాత చేసిన ‘దేవుడు చేసిన మనుషులు’ చిత్రానికి రఘుకుంచెని సంగీత దర్శకుడిగా పెట్టుకున్నాడు. ఆ సినిమాలో పాటలు హిట్ అయ్యాయి కానీ సినిమా మాత్రం నిరాశపరిచింది.