మాళవిక నాయర్ ..ఈ పేరు వినగానే ఈమె తమిళ నటి అని చాలా మంది అనుకుంటారు. కానీ ఈమె ఢిల్లీలో పుట్టి పెరిగింది. అటు తర్వాత వీళ్ళ ఫ్యామిలీ కేరళకి మారడం జరిగింది. అందుకే ఈమె మలయాళం సినిమాల్లో నటించి బాగా పాపులర్ అయ్యింది. 2012లో ఈమె సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. మొదట మలయాళం సినిమాల్లో అటు తర్వాత తమిళ సినిమాల్లో కూడా నటించింది. 2015లో వచ్చిన ‘ఎవడే సుబ్రమణ్యం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.
ఆ సినిమాలో ఈమె నటనతో ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంది. అటు తర్వాత ‘కళ్యాణం వైభోగం’ ‘మహానటి’ ‘విజేత’ ‘టాక్సీ వాలా’ వంటి చిత్రాలతో హిట్లు అందుకుంది. అయితే కొన్నాళ్లుగా ఈమె నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ప్లాప్ అవుతూ వస్తున్నాయి. ‘ఒరేయ్ బుజ్జిగా’ చిత్రం ఓటీటీకి వెళ్లి సేఫ్ అయిపోయింది. కానీ ‘థాంక్యూ’ సినిమా ప్లాప్ అయ్యింది. అయినా ఈమెకు తెలుగులో మంచి అవకాశాలే వస్తున్నాయి. ప్రస్తుతం ఈమె చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి.
డు మంచి ప్రాజెక్టులే. ఒకటి ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ’ లో చేస్తున్న ‘ఫలానా అమ్మాయి ఫలానా అబ్బాయి’ ఇంకోటి నందినీ రెడ్డి దర్శకత్వంలో చేస్తున్న ‘అన్నీ మంచి శకునములే’. ఈ రెండు సినిమాలపైనే ఈమె బోలెడు ఆశలు పెట్టుకుంది. వేరే భాషల్లో ఈమెకు అవకాశాలు లేవు. ఆఫర్ల కోసం ఈమె ఒకప్పటితో పోలిస్తే బాగా స్లిమ్ అయ్యి ఎక్స్పోజింగ్ చేయడానికి కూడా రెడీ అంటుంది ఈ అమ్మడు.