Manchu Vishnu: మళ్లీ చర్చల్లోకి టాలీవుడ్ హీరోల వాట్సాప్ గ్రూప్.. వాళ్లు మాత్రమే కాదట!
- June 19, 2025 / 11:46 AM ISTByFilmy Focus Desk
సినిమా హీరోలు అందరూ ఫ్రెండ్సే అంటుంటాం కదా.. వాళ్లకు వాట్సాప్ గ్రూపు లాంటివి ఏవీ ఉండవా? ఈ డౌట్ చాలా ఏళ్ల నుండి సగటు సినిమా అభిమానికి ఉంటూ వచ్చింది. కొంతమంది పేరుకే వాళ్లంతా ఒకటి అంటుంటారు కానీ.. ఒకటి కాదు అందుకే గ్రూప్ ఉండదు అని అంటే.. లేదు లేదు వాళ్లకు ఓ గ్రూప్ కచ్చితంగా ఉంటుంది అని మరికొందరు ఉన్నారు.
Manchu Vishnu
ఈ చర్చకు దాదాపు ఓ క్లారిటీ వచ్చిన సందర్భంగా ఇటీవల జరిగిన నాని (Nani) ఇంటర్వ్యూ. ‘హిట్ 3’ (HIT: The Third Case) సినిమా ప్రచారంలో భాగంగా ఈ గ్రూపు గురించి మళ్లీ చర్చ మొదలైంది.ఆ గ్రూపులో తాను తొలుత ఉండేవాడినని.. చాలా మంది హీరోలు అందులో ఉండేవారు అని నాని ఆ సందర్భంలో చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు ఆ గ్రూప్ యాక్టివ్‌గా లేదని, నేను కూడా ఫాలో అవ్వడం లేదు అన్నాడు. ఇప్పుడు తాజాగా మంచు విష్ణు (Manchu Vishnu ) కూడా ఈ గ్రూపు గురించి ప్రస్తావించాడు.

‘కన్నప్ప’ (Kannappa) సినిమా ప్రచారంలో భాగంగా విష్ణు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పుడు ఈ వాట్సప్ గ్రూప్ ప్రస్తావన వచ్చింది. తాను ఆ గ్రూప్‌లో ఉండేవాడినని, అయితే ఇప్పుడు లేనని తేల్చేశాడు విష్ణు (Manchu Vishnu).రానా (Rana Daggubati), రామ్ చరణ్ (Ram Charan), అల్లు అర్జున్ (Allu Arjun).. ఇలా అందరూ ఉన్న టాలీవుడ్ వాట్సాప్ గ్రూప్ నుంచి మీరు ఎందుకు బయటకు వచ్చారు? అని విష్ణు (Manchu Vishnu) దగ్గర అడిగితే.. నేను ఒకప్పుడు ఆ గ్రూప్‌లో ఉండేవాడిని. ఆ గ్రూప్‌లో హీరోయిన్స్ కూడా ఉన్నారు.

దీంతో నాకు అందులో చాట్ చేయాలంటే బిడియంగా ఉండేది. అందుకే ఎగ్జిట్ అయ్యాను. ఏదైనా చెప్పాలని ఉంటే నాకు పర్సనల్‌గా మెసేజ్ చేయండి అని ఫ్రెండ్స్‌కి చెప్పాను అని విష్ణు (Manchu Vishnu) క్లారిటీ ఇచ్చాడు. దీంతో మరోసారి ఈ గ్రూప్ గురించి డిస్కషన్ మొదలైంది.అందరూ చెప్పే మాట ఏంటంటే రానా (Rana Daggubati), చరణ్ (Ram Charan), బన్నీ (Allu Arjun) ప్రధానంగా ఈ గ్రూప్ నడిచేది అని. మరి ఇప్పుడు ఆ గ్రూప్ ఉందా? లేదా? అనేది తెలియాలి. అది ఆ కీలక సభ్యులే చెప్పాలి.

















