Megha Akash Engagement Photos: ఘనంగా హీరోయిన్ మేఘా ఆకాష్ ఎంగేజ్మెంట్.. వైరల్ అవుతున్న ఫోటోలు.!
- August 23, 2024 / 01:09 PM ISTByFilmy Focus
టాలీవుడ్ హీరోయిన్ మేఘా ఆకాష్ (Megha Akash) అందరికీ సుపరిచితమే. నితిన్ (Nithin Kumar) హీరోగా హను రాఘవపూడి (Hanu Raghavapudi) దర్శకత్వంలో రూపొందిన లై (LIE) సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత కూడా నితిన్ హీరోగా కృష్ణ చైతన్య (Krishna Chaitanya) దర్శకత్వంలో రూపొందిన చల్ మోహన్ రంగ (Chal Mohan Ranga) చిత్రంలో కూడా ఈమె హీరోయిన్ గా నటించింది. ఆ తరవాత తమిళంలో పలు సినిమాల్లో నటించలేదు. హిందీలో కూడా సినిమాలు చేసింది.ఆ తర్వాత మళ్ళీ తెలుగులో రాజ రాజ చోర (Raja Raja Chora) సినిమాలో కూడా నటించింది.
Megha Akash Engagement Photos

ఆమె కెరీర్లో హిట్ సినిమా అంటే ఇదే. ఆ తర్వాత రావణాసుర (Ravanasura) వంటి పెద్ద సినిమాలో కూడా ఈమె నటించింది. అయితే కొన్నాళ్లుగా సినిమాలకి దూరంగా ఉంటున్న ఈమె పై ఎక్కువగా పెళ్ళి వార్తలు వస్తున్నాయి గత కొన్ని నెలలుగా మేఘా ఆకాష్ డేటింగ్లో ఉన్నట్టు ప్రచారం జరిగింది. అయితే వీటిపై ఆమె క్లారిటీ ఇచ్చింది లేదు.అలాగని ఆ వార్తలు ఆగలేదు.తమిళనాడుకు చెందిన ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు కొడుకుతో ఆమె ప్రేమలో ఉందని…
అతన్నే పెళ్లి చేసుకోబోతోంది అనేది ఆ వార్తల సారాంశం. ఇక ఆమె పెళ్లి చేసుకోబోయే వ్యక్తి పేరు సాయి విష్ణు అని స్పష్టమవుతోంది. ఇక తాజాగా ఆ కుర్రాడితో సైలెంట్ గా ఎంగేజ్మెంట్ చేసుకుంది. తాజాగా ఆమె నిశ్చితార్థం ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే సాయి విష్ణు గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఇక మేఘా ఆకాష్ నిశ్చితార్థం (Megha Akash Engagement Photos) ఫొటోలు మీరు కూడా ఒకసారి చూడండి:
రహస్య మెడలో మూడు ముళ్లు వేసిన కిరణ్.. అన్యోన్యంగా ఉండాలంటూ?












