టాలీవుడ్‌లో స్టార్ హీరోలు (Heroes) వరుస విజయాలతో దూసుకెళ్తుంటే, మరోవైపు చిన్న సినిమాలు కూడా ఓటీటీలోనూ, థియేటర్లలోనూ మంచి ఆదరణ పొందుతున్నాయి. అయితే ఈ రెండు సెగ్మెంట్ల మధ్య ఉన్న మిడ్ రేంజ్ హీరోలు మాత్రం గట్టిపోటీని తట్టుకుని నిలదొక్కుకునేందుకు శ్రమిస్తున్నారు. కొంతమంది వరుస ఫ్లాప్‌లతో నష్టపోతుండగా, మరికొందరు రాబోయే సినిమాలపై భారీ ఆశలు పెట్టుకున్నారు. విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ప్రస్తుతం ఈ కేటగిరిలో ఉన్న టాప్ హీరో. ‘అర్జున్ రెడ్డి’ (Arjun Reddy), ‘గీత గోవిందం’ (Geetha Govindam) లాంటి బ్లాక్‌బస్టర్ల తర్వాత ‘లైగర్’ (Liger), ‘ఫ్యామిలీ స్టార్’ (The Family Star) ఫలితాలు అతనికి ఎదురు దెబ్బకొట్టాయి.
అయితే మే 30న విడుదల కానున్న ‘కింగ్‌డమ్’ (Kingdom) సినిమా విజయ్ మార్కెట్‌ను పాన్ ఇండియా స్థాయిలో నిలబెడుతుందా? అన్నదే ప్రశ్న. గౌతమ్ తిన్ననూరి (Gowtam Naidu Tinnanuri) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ స్పై థ్రిల్లర్ విజయ్ కెరీర్‌లో కీలకంగా మారనుంది. గోపీచంద్ (Gopichand) కూడా ఈమధ్య కాలంలో స్టేబుల్ హిట్ చూడలేదు. ‘రామబాణం’(Ramabanam), ‘భీమా’ (Bhimaa) వరుస ఫ్లాప్‌ల తర్వాత ‘విశ్వం’ (Viswam) సినిమా కొంతమేరకు ఊరట ఇచ్చినప్పటికీ, కానీ అది సరిపోదు. ప్రస్తుతం ఘాజి (Ghazi) దర్శకుడు సంకల్ప్(Sankalp Reddy) తో ఒక థ్రిల్లర్ డ్రామాతో మరో ప్రయోగం చేస్తున్నాడు.
కానీ, ఈ సినిమా మార్కెట్‌ను మళ్లీ స్ట్రాంగ్ చేస్తుందో లేదో చూడాలి. ఇక నితిన్ (Nithiin)విషయానికొస్తే, ‘భీష్మ’ (Bheeshma) తర్వాత ఊహించిన స్థాయిలో హిట్ లేదు. ‘మాచర్ల నియోజకవర్గం’ (Macherla Niyojakavargam), ‘రంగ్ దే’ (Rang De) లాంటి సినిమాలు ఫ్లాప్ కావడంతో, ఇప్పుడు ‘రాబిన్‌హుడ్’ (Robinhood) సినిమా మీద భారీ ఆశలు పెట్టుకున్నాడు. వెంకీ కుడుముల (Venky Kudumula) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, నితిన్‌ను మళ్లీ ట్రాక్‌లోకి తెచ్చే అవకాశముందా అనేది వేచి చూడాలి. వరుణ్ తేజ్(Varun Tej) , అఖిల్ (Akhil Akkineni) ఇద్దరూ వరుస ఫ్లాప్‌లతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
‘ఆపరేషన్ వాలెంటైన్’ (Operation Valentine) , ‘మట్కా’ (Matka) లాంటి సినిమాలు వరుణ్‌ను వెనక్కి నెట్టగా, అఖిల్‌కు ‘ఏజెంట్’ (Agent) మరింత దెబ్బ కొట్టింది. ప్రస్తుతం వరుణ్ ఓ హారర్ కామెడీతో, అఖిల్ కొత్త కథలతో లైన్‌లో ఉన్నప్పటికీ, వీరిద్దరికీ హిట్ ఖచ్చితంగా అవసరమే. ఇక మిడ్ రేంజ్ హీరోలకు (Heroes) హిట్ రావాలంటే మంచి కథలే ఆయుధమవ్వాలి. పాన్ ఇండియా మార్కెట్‌పై దృష్టిపెట్టడం ఎంతవరకు ఉపయోగపడుతుందనేది ప్రశ్నార్థకమే. అయితే, బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించాలంటే స్క్రిప్ట్ సెలక్షన్ మీద మరింత శ్రద్ధ పెట్టాల్సిందే. ఇక వీరికి బిగ్ హిట్ ఎప్పుడు వస్తుందో చూడాలి.