మంచు మనోజ్ తో (Manchu Manoj) మోహన్ బాబు(Mohan Babu), విష్ణు(Manchu Vishnu)..లు గొడవలు పడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మోహన్ బాబు విడుదల చేసిన ఓ ఆడియో క్లిప్ తెగ వైరల్ అవుతుంది. మోహన్ బాబు ఆ ఆడియో క్లిప్ ద్వారా మాట్లాడుతూ.. “మనోజ్ నువ్వు నా బిడ్డవి. మంచు లక్ష్మీ ప్రసన్న (Manchu Lakshmi) , విష్ణు, మనోజ్.. ముగ్గురూ నా బిడ్డలు. కానీ అందరికంటే ఎక్కువగా గారాభంగా పెంచుకున్నది నిన్నే. నువ్వు అడిగినవన్నీ ఇచ్చాను. బాగా చదివించాను.
Mohan Babu, Manchu Manoj
నేను చేసిన తప్పేంటి.? నీకు జన్మనివ్వడమే నేను చేసిన తప్పా? నాకు బిజినెస్..లు వంటివి వద్దు సినిమాలు చేసుకుంటాను అన్నావ్. మరి ఇప్పుడు నువ్వు చేస్తున్నది ఏంటి. మనకు వినయ్ అనే ఆయన వ్యాపారాల్లో సాయం చేయడానికి వస్తే.. ‘ఆ ల*జ కొ*కు అంటూ ఆయన్ని కొట్టడానికి వెళ్ళావ్. అడ్డుపడితే మీ అన్నని చంపేస్తాను అన్నావ్. కొట్టారా చూద్దాం అని నేనే అన్నాను. ఎందుకు ఇవన్నీ. మందు తాగుతావ్. పనివాళ్ళపై చెయ్యి చేసుకున్నావ్.
మందు తాగడంలో తప్పులేదు. అందరూ తాగుతారు.నేను కూడా మందు తాగుతాను. కానీ లిమిట్ ఉండాలి. రోజుకు రెండు పెగ్గులు తీసుకోవడంలో తప్పు లేదు. కానీ పని వాళ్ళు మన ఇంట్లో పని చేసుకుని వెళ్లిపోయేవాళ్లే. వాళ్లపై చెయ్యి చేసుకోవడం సరైన పద్ధతి కాదు. నువ్వు కొట్టిన వాళ్లలో ఒకడు చచ్చేవరకు వెళ్ళాడు. న్యాయంగా అయితే అప్పుడే నీపై పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. కానీ నేనే బ్రతిమాలి వద్దు అని ఆపాను.
నా ఇల్లు, నా ఆస్థి నా కష్టార్జితం. నా ఆస్తిని నేను అందరికీ సమానంగా పంచుతానా? లేక దానధర్మాలు చేస్తానా? అన్నది నా ఇష్టం. చెన్నైలో నేను అడుక్కుతిన్న రోజులు ఉన్నాయి. ఈరోజు దేవుడు దయవల్ల ఇలా ఉన్నాను. మీ అమ్మ నీ వల్ల హాస్పిటల్లో ఉంది. ఆమె వచ్చాక.. అడిగి నీ బిడ్డను నీకు ఇస్తాను. అప్పటివరకు నీ బిడ్డ బాధ్యత నాది” అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.