Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » “మోహన్ కృష్ణ గ్యాంగ్ లీడర్” చిత్రాన్ని మెగాస్టార్ట్ & పవన్ అభిమానులు అందరూ చూసి బిగ్ హిట్ చెయ్యాలి : సుమన్

“మోహన్ కృష్ణ గ్యాంగ్ లీడర్” చిత్రాన్ని మెగాస్టార్ట్ & పవన్ అభిమానులు అందరూ చూసి బిగ్ హిట్ చెయ్యాలి : సుమన్

  • June 23, 2023 / 08:28 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

“మోహన్ కృష్ణ గ్యాంగ్ లీడర్” చిత్రాన్ని మెగాస్టార్ట్ & పవన్ అభిమానులు అందరూ చూసి బిగ్ హిట్ చెయ్యాలి :  సుమన్

జై యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి క్రియేషన్స్ సమర్పణలో యస్.యం.కె.ఫిల్మ్స్ పతాకంపై మోహన్ కృష్ణ, సౌజన్య, హరిణి రెడ్డి హీరో హీరోయిన్స్ గా శ్రీ లక్ష్మణ్ దర్శకత్వంలో సింగూలూరి మోహన్ రావు నిర్మించిన చిత్రం “మోహన్ కృష్ణ గ్యాంగ్ లీడర్”. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని జులై 7 న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్న సందర్భంగా చిత్ర యూనిట్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి సీనియర్ హీరో సుమన్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్, నిర్మాత తుమ్మలపల్లి, రామసత్యనారాయణ, దర్గా చిన్నా (పహిల్వాన్), తెలంగాణ ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్, నిర్మాత లక్ష్మీపతి, దిల్ రమేష్, గీతా సింగ్, పింగ్ పాంగ్ సూర్య, జగదీశ్వర్, మమత తదితరులు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా

సీనియర్ హీరో సుమన్ మాట్లాడుతూ.. మా తల్లి చెన్నైలో ఒక స్కూల్ కు ప్రిన్సిపాల్. సూపర్ స్టార్ కృష్ణ కూతురు, శోభన్ బాబు కూతురు, తమిళనాడు గవర్నర్ కూతురు మా అమ్మ స్టూడెంట్స్. ఇలా చెప్పుకుంటూ పొతే చాలా ఉన్నాయి. మా అమ్మ ఎంతోమంది పేద విద్యార్థులకు తన సొంత డబ్బుతో చదువు చెప్పించింది. మా తల్లి తండ్రులు చేసిన పుణ్యం ఒక ఎత్తయితే నన్ను నమ్మి నాకు సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతల పుణ్యమే నన్ను ఇండస్ట్రీలో నిలబెట్టేలా చేసింది..మొదట దర్శకుడు గ్యాంగ్ లీడర్ కథ చెప్పగానే నాకు చాలా బాగా నచ్చింది. రైతులు ఇబ్బందులు పడుతున్న ఒక బర్ణింగ్ ఇష్యూపై నా క్యారెక్టర్ ఉంటుంది. రైతు పాత్రలో నటించినందుకు చాలా హ్యాపీ గా ఉంది. ఎందుకంటే రైతులేని రాష్ట్రం లేదు, రైతులేని దేశం లేదు. కరోనా టైం లో మనము బయట పడ్డాము అంటే ఆది రైతు వలనే. వారి ద్వారానే మనందరికీ ఫుడ్ లభించింది. వారు చేసిన కష్టం ఎప్పటికీ మరువలేము. ఇలాంటి మంచి చిత్రంలో రైతు పాత్రలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు. చిరంజీవి అభిమాని అయిన మోహన్ కృష్ణ ఇందులో హీరోగా చాలా బాగా నటించాడు. మంచి కాన్సెప్ట్ తో తీసిన ఈ సినిమాను అందరూ ఫ్యామిలీతో వచ్చి చూసే విధంగా తీయడం జరిగింది . చిరంజీవి నటించిన గ్యాంగ్ లీడర్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమాను మేఘా అభిమానులు, పవన్ అభిమానులు అందరూ కూడా ఈ సినిమాను చూసి బిగ్ హిట్ చేసి నిర్మాత సింగూలూరి మోహన్ రావు గారికి సపోర్ట్ గా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

చిత్ర హీరో మోహన్ కృష్ణ మాట్లాడుతూ.. మా సినిమాను ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలకు నా ధన్యవాదములు.
ప్రస్తుతం ఒక చిన్న పాయింట్ ను తీసుకొని సినిమా తీస్తున్న ఈ రోజుల్లో ఒక కొత్త కథను సెలెక్ట్ చేసుకొని ఒక రైతు మీద , ఫ్రెండ్స్ మీద, రాజకీయం, స్నేహం ఇలా ఒక ఐదు బర్నింగ్ ఇష్యుస్ గురించి ఈ సినిమాలో చూపించడం జరుగుతుంది. నేను హీరోగా నటించినా ఈ సినిమాకు అసలు హీరో సుమన్ గారే. తను ఇందులో చాలా బాగా నటించారు. ఈ సినిమాలో చాలామంది సీనియర్ ఆర్టిస్టులు నటించడం జరిగింది. ఇందులో ఉన్న ఆరు పాటలకు ఘనష్యామ్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఐదు ఫైట్స్ కు రామ్ సుంకర బాగా కంపోజ్ చేశారు. నటీ, నటులు, టెక్నిషియన్స్ అందరూ ఫుల్ సపోర్ట్ చేయడంతో సినిమా బాగా వచ్చింది. మొదట టైటిల్ గురించి డిస్కషన్ చేస్తున్న మాకు ప్రసన్న కుమార్ గారే ఈ టైటిల్ పెట్టమని చెప్పారు. అందుకు వారికీ మా ధన్యవాదములు. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా తెరకెక్కిన మోహన్ కృష్ణ “గ్యాంగ్ లీడర్” సినిమా జూలై 7న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమాను ప్రేక్షకులందరూ ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

చిత్ర దర్శకుడు శ్రీ లక్ష్మణ్ మాట్లాడుతూ.. జులై 7 న రిలీజ్ అవుతున్న ఈ సినిమాను చాలా కష్టపడి తీయడం జరిగింది. రైతు గురించి మంచి కాన్సెప్ట్ తీసుకొని చేసిన ఈ సినిమా లో జై కిషన్, జై జవాన్ అనే నినాదం ఎంత గొప్పదో ఈ చిత్రంలో చూడచ్చు. సినిమాకు ఘనష్యామ్ అద్భుతమైన సంగీతం అందించారు. సినిమాటోగ్రాఫర్ మురళి అద్భుతమైన విజువల్స్ అందించాడు ఇలా ఇందులో అందరు టెక్నిషియన్స్ సినిమాకు చాలా కష్టపడ్డారు. ఇందులో నటించిన వారందరూ చాలా బాగా నటించారు. ఇలాంటి మంచి సినిమా చేసే అవకాశం ఇచ్చిన నిర్మాతకు ధన్యవాదాలు. మంచి కాన్సెప్ట్ తో జులై 7 న వస్తున్న మా సినిమాను బిగ్ హిట్ చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

దర్గా చిన్నా పహిల్వాన్ మాట్లాడుతూ.. మంచి కాన్సెప్ట్ తో తీసిన ఈ సినిమా జులై 7 న విడుదల అవుతుంది. అందరూ ఈ సినిమాను చూసి ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను.

ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. రైతు అయిన మొహాన్ కుమార్ గారికి సినిమా అంటే ప్యాషన్. ఆ ప్యాషన్ తో తనకున్న పొలాన్ని అమ్మి రైతు పడే ఇబ్బందులను ఈ చిత్రంలో చాలా చక్కగా చూయించడం జరిగింది. ఇక్కడున్న ప్రతి ఒక్కరూ రైతు కుటుంబం నుండి వచ్చిన వారే. కాబట్టి రైతు కష్టాన్ని గుర్తించిన ప్రతి ఒక్కరూ కూడా ఈ సినిమాను చూసి చిరంజీవి చేసిన ఆ “గ్యాంగ్ లీడర్” కంటే బిగ్ హిట్ చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

తెలంగాణ ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ… సుమన్ గారు చాలా మంచి వ్యక్తి, అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి,అందుకే తనంటే అందరికీ చాలా ఇష్టం. తను నటించిన ఎన్నో సినిమాలు హిట్ సాధించాయి. అటువంటి వ్యక్తి నీ సినిమా ఫంక్షన్ కు రాలేదని నీ సినిమా పబ్లిసిటీ కోసం డయాస్ పై ఆలా మాట్లాడం కరెక్ట్ కాదు. దానిని మేమంతా కండిస్తున్నాము. వెంటనే ఆయనను క్షమాపణ కోరుతూ విడియో పెట్టాలని లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ఇక ఈ సినిమా విషయానికి వస్తే చిత్ర దర్శకుడు లక్ష్మణ్ చిరంజీవికి విరాభిమాని. ఈ సినిమాలో ఫైట్స్, ఏమోషన్స్ తో బాగా తీశాడు అనుకుంటున్నాను. మంచి కాన్సెప్ట్ తో తీసిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యి నిర్మాత మరో పది సినిమాలు తియ్యాలని అన్నారు.

నిర్మాత రామసత్యనారాయణ మాట్లాడుతూ.. టీజర్, ట్రైలర్ చూస్తుంటే మోహన్ గారి కష్టం ఈ సినిమాలో కనిపిస్తుంది. ఈ సినిమాకు నటీ నటులు, టెక్నిషియన్స్ బాగా కష్టపడ్డారు. రైతు పడే ఆవేదనను ఈ సినిమాలో చాలా చక్కగా చూయించారు. అన్ని వర్గాల వారికీ నచ్చేవిధంగా నవరసాలు ఉండేలా ఈ సినిమాను తెరకెక్కించారు. జులై 7 న వస్తున్న ఈ సినిమాను ప్రేక్షకులు బిగ్ హిట్ చెయ్యాలని అన్నారు.

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గిరి మాట్లాడుతూ.. జులై 7 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా సినిమాను అందరూ ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

నటుడు ప్రసన్నకుమార్ మాట్లాడుతూ.. మెగాస్టార్ చిరంజీవి నటించిన గ్యాంగ్ లీడర్ ఎంత బిగ్ హిట్ అయ్యిందో మనందరికీ తెలిసిందే. అలాగే నాని గారు నటించిన “నానిస్ గ్యాంగ్ లీడర్” కూడా బిగ్ హిట్ అయ్యింది. ఇప్పుడు “మోహన్ కృష్ణ గ్యాంగ్ లీడర్” గా వస్తున్న ఈ సినిమా కూడా ఆ సినిమాల లాగే బిగ్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mohan Krishna’s Gang Leader
  • #Suman

Also Read

2025 October Box-office: 2025 అక్టోబర్ ప్రోగ్రెస్.. 60 వచ్చాయి.. 4 మాత్రమే నిలబడ్డాయి

2025 October Box-office: 2025 అక్టోబర్ ప్రోగ్రెస్.. 60 వచ్చాయి.. 4 మాత్రమే నిలబడ్డాయి

Champion Teaser: ‘ఛాంపియన్’ టీజర్ రివ్యూ

Champion Teaser: ‘ఛాంపియన్’ టీజర్ రివ్యూ

Mass Jathara: ‘మాస్ జాతర’ ప్లస్ పాయింట్స్ అండ్ మైనస్ పాయింట్స్

Mass Jathara: ‘మాస్ జాతర’ ప్లస్ పాయింట్స్ అండ్ మైనస్ పాయింట్స్

Chiranjeevi: డీప్ ఫేక్ వీడియోలు, ఫోటోలపై చిరు స్పందన.. ఇంకా కఠిన చట్టాలు రావాలంటూ..!

Chiranjeevi: డీప్ ఫేక్ వీడియోలు, ఫోటోలపై చిరు స్పందన.. ఇంకా కఠిన చట్టాలు రావాలంటూ..!

Allu Sirish: ఘనంగా జరిగిన శిరీష్-నైనికా..ల నిశ్చితార్థం

Allu Sirish: ఘనంగా జరిగిన శిరీష్-నైనికా..ల నిశ్చితార్థం

Mass Jathara Review in Telugu: మాస్ జాతర సినిమా రివ్యూ & రేటింగ్!

Mass Jathara Review in Telugu: మాస్ జాతర సినిమా రివ్యూ & రేటింగ్!

related news

పెద్ద ఫ్యామిలీ కాబట్టి ఇండస్ట్రీలో ఉంటాడు..కానీ పాన్ ఇండియా స్టార్ అవుతాడని ఊహించలేదు

పెద్ద ఫ్యామిలీ కాబట్టి ఇండస్ట్రీలో ఉంటాడు..కానీ పాన్ ఇండియా స్టార్ అవుతాడని ఊహించలేదు

trending news

2025 October Box-office: 2025 అక్టోబర్ ప్రోగ్రెస్.. 60 వచ్చాయి.. 4 మాత్రమే నిలబడ్డాయి

2025 October Box-office: 2025 అక్టోబర్ ప్రోగ్రెస్.. 60 వచ్చాయి.. 4 మాత్రమే నిలబడ్డాయి

1 hour ago
Champion Teaser: ‘ఛాంపియన్’ టీజర్ రివ్యూ

Champion Teaser: ‘ఛాంపియన్’ టీజర్ రివ్యూ

3 hours ago
Mass Jathara: ‘మాస్ జాతర’ ప్లస్ పాయింట్స్ అండ్ మైనస్ పాయింట్స్

Mass Jathara: ‘మాస్ జాతర’ ప్లస్ పాయింట్స్ అండ్ మైనస్ పాయింట్స్

15 hours ago
Chiranjeevi: డీప్ ఫేక్ వీడియోలు, ఫోటోలపై చిరు స్పందన.. ఇంకా కఠిన చట్టాలు రావాలంటూ..!

Chiranjeevi: డీప్ ఫేక్ వీడియోలు, ఫోటోలపై చిరు స్పందన.. ఇంకా కఠిన చట్టాలు రావాలంటూ..!

16 hours ago
Allu Sirish: ఘనంగా జరిగిన శిరీష్-నైనికా..ల నిశ్చితార్థం

Allu Sirish: ఘనంగా జరిగిన శిరీష్-నైనికా..ల నిశ్చితార్థం

16 hours ago

latest news

Ajith: కరూర్‌ తొక్కిసలాటపై ఫస్ట్‌ టైమ్‌ రియాక్ట్‌ అయిన అజిత్‌.. ఏమన్నాడంటే?

Ajith: కరూర్‌ తొక్కిసలాటపై ఫస్ట్‌ టైమ్‌ రియాక్ట్‌ అయిన అజిత్‌.. ఏమన్నాడంటే?

2 hours ago
Tourist Family: సైలెంట్ గా పెళ్లి చేసుకున్న ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ దర్శకుడు

Tourist Family: సైలెంట్ గా పెళ్లి చేసుకున్న ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ దర్శకుడు

16 hours ago
Salman Khan, Dil Raju: దిల్ రాజుతో సల్లూభాయ్ డీల్?

Salman Khan, Dil Raju: దిల్ రాజుతో సల్లూభాయ్ డీల్?

16 hours ago
Sai Dharam Tej: తేజు సినిమాకి ఆర్థిక ఇబ్బందులు క్లియర్ అయినట్టేనా?

Sai Dharam Tej: తేజు సినిమాకి ఆర్థిక ఇబ్బందులు క్లియర్ అయినట్టేనా?

16 hours ago
Rajamouli: ‘బాహుబలి 2’ మొదటిసారి చూసినప్పుడు నాకు నిద్ర వచ్చేసింది: రాజమౌళి

Rajamouli: ‘బాహుబలి 2’ మొదటిసారి చూసినప్పుడు నాకు నిద్ర వచ్చేసింది: రాజమౌళి

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version