తెలుగు నిర్మాతల ధైర్యం ఏమిటో…
- August 20, 2021 / 01:28 PM ISTByFilmy Focus
ఓటీటీలకు కాకుండా థియేటర్లలోనే తమ సినిమాలు విడుదల చేద్దాం అనుకున్న నిర్మాతలు… ఒక్కొక్కరు డేట్స్ అనౌన్స్ చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో వచ్చే నెల 10న రెండు సినిమాలు థియేటర్లకు రావడానికి ప్రయత్నిస్తున్నాయి. అందులో ఒకటి ‘లవ్‌స్టోరీ’ కాగా, రెండోది ‘సీటీమార్’. తొలి సినిమా డేట్ చెప్పేయగా, రెండోది పక్కా అంటున్నారు. అయితే ఇక్కడే ఒకటే డౌట్. వీళ్లంతా ఆగింది ఏపీలో టికెట్ ధరల లెక్కల తేలక. మరిప్పుడు ధైర్యం ఏంటో?
ఏపీలో థియేటర్లలో టికెట్ ధరలను వేసవి సమయంలో ప్రభుత్వం సవరించింది. తెలంగాణలో ఉన్న ధరలకు ఏ మాత్రం దగ్గరకు రాకుండా… బాగా తక్కువ ధరలను నిర్ణయించింది. దీంతో ఆ ధరలకు థియేటర్లు నడకపలేక చాలామంది తాత్కాలికంగా మూసేశారు. ప్రస్తుతం చాలా తక్కువ మొత్తంలో థియేటర్లు రన్ అవుతున్నాయి. దీంతో చాలామంది నిర్మాతలు సినిమాల విడుదలకు ముందుకు రావడం లేదు. అయితే ‘రండి మాట్లాడుకుందాం’ అని ఇటీవల ఏపీ సీఎం వైఎస్ జగన్ టాలీవుడ్‌కి పిలుపునిచ్చారు.

సీఎం జగన్ – టాలీవుడ్ పెద్దల మీటింగ్ త్వరలో జరుగుతుంది. అందులో ఎలాంటి నిర్ణయాలు వస్తాయనేది ఇప్పుడే చెప్పలేం. అయితే పరిశ్రమకు అనుకూలంగా నిర్ణయం వస్తుందని పెద్దలు ఆశిస్తున్నారు. కొంతమందైతే ఊహిస్తున్నారు. అందులో భాగంగానే సినిమా విడుదల తేదీలు ప్రకటిస్తున్నారని అంటున్నారు. ఆశ బాగుంది…. సీఎం జగన్ మనసులో ఏముందో చూడాలి.
Most Recommended Video
నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!















