ప్రతి ఏడాది ఆస్కార్ రేసులో భారతీయ సినిమాలు పోటీపడడం అనేది సర్వసాధారణం అయిపోయింది. ఇప్పటివరకు సలాం బాంబే (1988), లగాన్ (2001), స్లమ్ డాగ్ మిలియనీర్ (Slumdog Millionaire) (2008), ది లంచ్ బాక్స్ (2013) వంటి అరుదైన సినిమాలు మాత్రమే ఆస్కార్ రేసులో నిలదొక్కుకుని ఉత్తమ ఫారిన్ చిత్రం కేటగిరీ లో అకాడమీ అవార్డ్ అందుకున్నాయి. గత ఏడాది మన ఫిలిం జ్యూరీ మలయాళ చిత్రం “2018”ను పంపగా కనీసం నామినేషన్స్ లో కూడా స్థానం సంపాదించుకోలేకపోయింది.
Oscars 2025
2025లో నిర్వహించబడనున్న 97వ ఆస్కార్ వేడుక కోసం ఇండియన్ జ్యూరీ ఈసారి హిందీ చిత్రం “లాపతా లేడీస్”ను అఫీషియల్ గా పంపింది. అయితే.. ఈ రేసులో తెలుగు నుండి 3 సినిమాలున్నాయి, అవే “హనుమాన్ (Hanuman), మంగళవారం (Mangalavaaram) , కల్కి” (Kalki 2898 AD) . అలాగే తమిళం నుండి 6 సినిమాలు.. “కొట్టుక్కాలి, మహారాజా, జిగర్తాండ డబుల్ ఎక్స్ (Jigarthanda DoubleX) , తంగలాన్ (Thangalaan) , జామా, వాళై”, మలయాళం నుండి 4.. “అట్టం, ఉల్లొజుక్కు, ఆడు జీవితం, ఆల్ వి ఇమేజిన్ యాజ్ లైట్”, హిందీ నుండి ఏకంగా 12 సినిమాలు..
“లాపతా లేడీస్, చోటా భీమ్, గుడ్ లక్, కిల్, యానిమల్, శ్రీకాంత్,, చందు ఛాంపియన్, జోరాం, మైదాన్, సామ్ బహదూర్, స్వాతంత్ర్య వీర్ సవర్కర్, ఆర్టికల్ 370” వంటి సినిమాలతోపాటుగా మరాఠీకి చెందిన 3 సినిమాలు.. “ఘరట్ గణపతి, స్వరగాంధర్వ సుధీర్ పాడ్కే, ఘాత్” మరియు ఒడియా నుంచి ఒకే ఒక్క సినిమా “ఆభా” ఈ ఆస్కార్ (Oscars 2025) రేసులో ఉన్నాయి.
వీటన్నిటిలో ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాత్రం “లాపతా లేడీస్”ను మాత్రమే సెలక్ట్ చేయడం గమనార్హం. మరి ఈసారైనా మన భారతీయ చిత్రం నామినేషన్స్ ను దాటుకొని ఆస్కార్ వేదిక దాకా వెళ్తుందేమో చూడాలి.