సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) కెరీర్ ప్రారంభంలో వచ్చింది ‘మురారి’ (Murari) . ఈ సినిమా అతని కెరీర్లోనే ఓ స్పెషల్ మూవీ అని చెప్పాలి. ‘రామ్ ప్రసాద్ ఆర్ట్స్’ (C. Ram Prasad) బ్యానర్ పై ఎన్.దేవి ప్రసాద్, రామలింగేశ్వరరావు , గోపి నందిగం(Gopi Nandigam) ..లు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ (Krishna Vamsi) దర్శకుడు. దివంగత దర్శకుడు శోభన్(Sobhan) (‘బాబీ’ (Bobby) ‘వర్షం’ (Varsham) చిత్రాల దర్శకుడు) దీనికి స్క్రీన్ ప్లే రైటర్ గా పనిచేశారు. 2001 ఫిబ్రవరి 17న పెద్దగా అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యింది ‘మురారి’. ప్లాప్ టాక్ తో మొదలైన ఈ సినిమా రన్ సూపర్ హిట్ గా నిలిచింది.
34 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకున్న ఈ సినిమా 3 కేంద్రాల్లో 175 రోజులు ఆడింది. రీ రిలీజ్ లో కూడా ఈ సినిమా రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే. ఒకసారి ఈ సినిమా క్లోజింగ్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 3.25 cr |
సీడెడ్ | 2.11 cr |
ఉత్తరాంధ్ర | 1.55 cr |
ఈస్ట్ | 0.92 cr |
వెస్ట్ | 0.80 cr |
గుంటూరు | 1.65 cr |
కృష్ణా | 1.35 cr |
నెల్లూరు | 0.70 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 12.33 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ | 0.65 Cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 12.98 cr |
‘మురారి’ చిత్రం రూ.8 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. అన్ సీజన్లో రిలీజ్ అయినప్పటికీ ఫుల్ రన్లో ఈ సినిమా రూ.12.98 కోట్ల షేర్ ను రాబట్టి సూపర్ హిట్ గా నిలిచింది.