ఈ మధ్య కాలంలో చూసుకుంటే ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లడం తగ్గించారు. అది అందరూ ఒప్పుకోవాల్సిన విషయమే. కానీ ఎందుకు ప్రేక్షకులు థియేటర్లకు రావడం తగ్గించారు అని దర్శకనిర్మాతల్ని ప్రశ్నిస్తే.. సింపుల్ గా ప్రేక్షకులు ఓటీటీలకి అలవాటు పడిపోయారు అంటూ చెప్పి మాట దాటేస్తున్నారు. సరే వాళ్ళు అనుకున్నదే నిజం అనుకుంటే.. ఇటీవల వచ్చిన ‘కమిటీ కుర్రోళ్ళు’ (Committee Kurrollu) ఎందుకు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. ‘కల్కి..’ (Kalki 2898 AD) పెద్ద సినిమా కాబట్టి జనాలు వెళ్లారు అంటున్నారు.
Murari
మరి ‘కమిటీ కుర్రోళ్ళు’ కి ఎందుకని ఓపెనింగ్స్ వచ్చాయి. సరే అది కూడా పక్కన పెట్టేద్దాం.. మహేష్ బాబు (Mahesh Babu) బర్త్ డే స్పెషల్ గా రీ-రిలీజ్ అయిన ‘మురారి’ (Murari) సినిమా వీకెండ్ వరకు హౌస్ ఫుల్స్ పెట్టింది. ఆ సినిమా ఓటీటీలో మాత్రమే కాదు యూట్యూబ్లో కూడా చాలా ఛానల్స్ లో అందుబాటులో ఉంది. అయినప్పటికీ ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లి చూశారు. ముఖ్యంగా ఫ్యామిలీస్ వెళ్లి చూశారు.
రీ రిలీజ్ సినిమా కదా అని టికెట్ రేట్లు ఎక్కువ అని ప్రేక్షకులు ‘మురారి’ ని దూరం పెట్టలేదు. కొన్ని చోట్ల అయితే లైన్లో నిలబడి మరీ టికెట్లు తీసుకున్నారు.ఓ రీ రిలీజ్ సినిమాకి ఇంత హడావిడి ఉంటే.. మరి కొత్త సినిమాలకి ఎందుకు ఉండటం లేదు. సో మేకర్స్ కూడా ఓటీటీలపైకి తోసేయకుండా, కంటెంట్ పైనే దృష్టి పెట్టాలి. మంచి కంటెంట్ ఉంటే.. థియేటర్లకు రావడానికి ప్రేక్షకులు ఎప్పుడూ సిద్ధమే.