మైత్రి మూవీ మేకర్స్… టాలీవుడ్ లో ఉన్న బడా నిర్మాణ సంస్థల్లో ఈ బ్యానర్ ఒక అడుగు ముందే ఉంది. శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, రంగస్థలం వంటి మూడు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ అందుకుని స్ట్రాంగ్ బేస్ వేసుకుంది ఈ సంస్థ. రవి శంకర్, నవీన్ ఎర్నేని ఎంతో ప్యాషనేట్ గా సినిమాలు చేస్తూ టాప్ పొజిషన్ లో దూసుకుపోతున్నారు. ఈ బ్యానర్ లో ఏ స్టార్ హీరో సినిమా చేసినా… తమ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ ను అందుకుంటూ వచ్చారు.
అయితే చిన్న , మిడ్ రేంజ్ హీరోల సినిమాల విషయంలో మాత్రం మైత్రి కాస్త వెనుకపడే ఉంది..! మిడ్ హీరోల సినిమాల విషయంలో తమ వరకు ఎటువంటి లోపం చేయడం లేదు. కానీ ఫలితాలు తేడా కొట్టేస్తున్నాయి. నానితో చేసిన ‘నానీస్ గ్యాంగ్ లీడర్’ ‘అంటే సుందరానికి’ , విజయ్ దేవరకొండతో చేసిన ‘డియర్ కామ్రేడ్’, రవితేజ తో చేసిన ‘అమర్ అక్బర్ ఆంటోనీ’, నాగ చైతన్యతో చేసిన ‘సవ్య సాచి’ ఈ సినిమాలు ఏవీ సక్సెస్ కాలేదు.
‘మైత్రి’ వారు నిర్మించిన మిడ్ రేంజ్ సినిమాలు ఏవైనా ఉన్నాయా అంటే అది ‘చిత్రలహరి’ ఇంకోటి ‘మత్తు వదలరా’. అవి కూడా కమర్షియల్ గా గట్టెక్కడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఇటీవల వచ్చిన ‘అమిగోస్’ మూవీ మంచి టాక్ సంపాదించుకున్నా.. బాక్సాఫీస్ వద్ద నిరుత్సాహపరుస్తుంది. ఫుల్ రన్లో బ్రేక్ ఈవెన్ అవ్వడం కష్టంగా మారింది. ఈ సినిమా ఫలితంతో మిడ్ రేంజ్ సినిమాలను మైత్రి వారు పట్టించుకోవడం లేదు అనే టాక్ మొదలైంది.
అయితే అలాంటి ఆరోపణలు కరెక్ట్ కాదు. ‘మీడియం రేంజ్ సినిమాలు అయినా వీళ్ళు భారీగానే ఖర్చు పెడుతున్నారు. ప్రమోషన్ల విషయంలో కూడా ఎక్కడా లోటు చేయడం లేదు. అయితే తమ మీడియం రేంజ్ సినిమాలను రిలీజ్ చేస్తున్న సీజన్ ల విషయంలో తేడా ఉందేమో చెక్ చేసుకుంటే బెటర్. అన్ సీజన్లో రిలీజ్ అయినా ఫలితాలు తేడా కొట్టేస్తాయి.