నాగబాబు (Naga Babu) బన్నీ (Allu Arjun) మధ్య కొంత గ్యాప్ ఏర్పడిందని కొన్నిరోజుల క్రితం పదుల సంఖ్యలో కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. బన్నీ టార్గెట్ గా కొన్ని నెగిటివ్ కామెంట్స్ సైతం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అయ్యాయి. అయితే తాజాగా నెటిజన్లతో ముచ్చటించిన నాగబాబు ఆ నెగిటివిటీకి చెక్ పెట్టే విధంగా వ్యవహరించడం గమనార్హం. నాగబాబు చెప్పిన కొన్ని జవాబులు ప్రేక్షకులను ఒకింత ఆశ్చర్యానికి గురి చేశాయి. నాగబాబు మాట్లాడుతూ ఒకప్పుడు నేను పెద్దగా చేసిందేమీ లేదని ఇప్పుడు చేయకపోయినా పోయేదేమీ లేదని సినిమాల గురించి నాగబాబు పేర్కొన్నారు.
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) రాజకీయాల్లో కొనసాగడంతో పాటు సినిమాల్లో సైతం కొనసాగాలని కోరుకుంటున్నానని నాగబాబు చెప్పుకొచ్చారు. మీరు ఎంపీ లేదా ఎమ్మెల్యే అవుతారని అనుకున్నామని కామెంట్ చేయగా సరే సర్లే.. అన్నీ జరుగుతాయా ఏంటి అంటూ నాగబాబు కామెంట్లు చేశారు. జనసేన 100 శాతం స్ట్రైక్ రేట్ సాధించడం చాలా సంతోషంగా అనిపించిందని నాగబాబు పేర్కొన్నారు.
లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) వినయం, మంచి మనస్సు ఉన్న మనిషి అని నాగబాబు తెలిపారు. బన్నీ శ్రమ పడే తత్వం ఉన్న వ్యక్తి అని పుష్ప ది రూల్ కోసం ఎదురుచూస్తున్నానని నాగబాబు చెప్పుకొచ్చారు. మా అన్నయ్య, తమ్ముడు అభిమాన హీరోలు అని నాగబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు. నాకు ఇష్టమైన క్రికెటర్ పవన్ కళ్యాణ్ అని 100 శాతం స్ట్రైక్ రేట్ కాబట్టి ఈ కామెంట్ చేస్తున్నానని నాగబాబు పేర్కొన్నారు.
జనసేనలో నేను కష్టపడింది 0000001 శాతం మాత్రమేనని ఆయన వెల్లడించారు. మంగళగిరికి వెళ్లి పవన్ కళ్యాణ్ ను కలవాలంటే కలవవచ్చని నాగబాబు తెలిపారు. నాగబాబు బన్నీ గురించి పాజిటివ్ గా రియాక్ట్ కావడం ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది. బన్నీ పుష్ప ది రూల్ (Pushpa 2) సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే.