నాగ చైతన్య (Naga Chaitanya) కెరీర్‌లో కొత్త రికార్డ్ సెట్ అయింది. తండేల్ 90 కోట్ల క్లబ్‌లోకి ఎంటర్ అవ్వడం, ఇంకా స్టడీగా వసూళ్లు రావడం చూస్తుంటే, వంద కోట్ల టార్గెట్ అందుకోవడం లాంఛనమే. చైతూ కెరీర్‌లోనే ఇది తొలి సెంచరీ కావడంతో అక్కినేని ఫ్యాన్స్ సంబరాలు మొదలుపెట్టేశారు. త్వరలోనే మేకర్స్ 100 కోట్ల గ్రాస్ క్లబ్ అనౌన్స్‌మెంట్ ఇవ్వనున్నారని టాలీవుడ్ వర్గాల టాక్. ఈ లెక్కన చూస్తే, ఇప్పటి వరకు నాగ చైతన్య రీచ్ కాలేకపోయిన మార్కెట్‌ను తండేల్ సాధించేసింది.
ఇది చైతూ కెరీర్‌లో టర్నింగ్ పాయింట్ అనడంలో సందేహమే లేదు. ఇక తండేల్ సెంచరీ తర్వాత అక్కినేని ఫ్యాన్స్ కు మరో టార్గెట్ ఉంది. అదే కింగ్ నాగార్జున. ఇప్పటి వరకు ఎన్నో సక్సెస్‌ఫుల్ సినిమాలు చేసిన నాగ్, కానీ 100 కోట్ల క్లబ్‌ను అందుకోలేకపోయాడు. తాజాగా ఓ ఈవెంట్‌లో నాగార్జున (Nagarjuna) మాట్లాడుతూ, దర్శకుడు చందూ మొండేటితో (Chandoo Mondeti) ఓ సినిమా చేయాలని ఉందని ఆసక్తికరంగా ప్రకటించారు. అక్కినేని ఫ్యాన్స్ అప్పటి నుంచీ ఇదే గురించీ చర్చించుకుంటున్నారు.
చందూ మొండేటి ప్రస్తుతం టాలీవుడ్‌లో కార్తికేయ 2 (Karthikeya 2) , తండేల్ (Thandel) వంటి పాన్ ఇండియా సినిమాలతో హిట్స్ కొట్టిన దర్శకుడు. నాగ్ కూడా ఒక మంచి స్క్రిప్ట్ దొరికితే పాన్ ఇండియా సినిమా చేసేందుకు రెడీ అన్నట్టే. ఇప్పటికే చందూ రెండు పాన్ ఇండియా హిట్స్ ఇచ్చాడు. కార్తికేయతో హిందీ మార్కెట్‌లో ఓ రేంజ్ బజ్ తెచ్చుకున్నాడు. మరి ఇప్పుడు నాగార్జునతో ఓ అద్భుతమైన కథను తెరకెక్కిస్తే, కింగ్ కెరీర్‌లో వంద కోట్ల క్లబ్ కేవలం లెక్క సర్దే విషయమవుతుందని అక్కినేని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
ఇంకా అక్కినేని అభిమానుల కల చిన్నది కాదు. చందూ మొండేటి నాగార్జునతో సినిమా చేయడమే కాదు, ఒకవేళ భవిష్యత్తులో అఖిల్‌తో కూడా ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయాలని కోరుకుంటున్నారు. ఒకప్పుడు మాస్, క్లాస్ ఆడియన్స్‌ను తనదైన స్టైల్‌లో ఎంటర్‌టైన్ చేసిన నాగార్జున (Nagarjuna), మరోసారి మాస్ హిట్ అందుకుంటాడా? దర్శకుడిగా చందూ మొండేటిని ఎంచుకుని సెంచరీ కొడతాడా? అనేది ఆసక్తికరంగా మారింది.