నందమూరి తారకరామారావు (Sr NTR) గారి తనయుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు హరికృష్ణ (Hari krishna). చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన హరికృష్ణ.. ఆ తర్వాత 4 ,5 సినిమాల్లో నటించారు. కానీ ఎందుకో ఆ తర్వాత నటనకు బ్రేక్ ఇచ్చేశారు. ‘శ్రీరాములయ్య’ ‘శుభలేఖలు’ వంటి సినిమాల్లో అతిథి పాత్రలు చేసినా ఆయనకు తగిన గుర్తింపు రాలేదు. అయితే దర్శకుడు వైవిఎస్ చౌదరి (Y. V. S. Chowdary).. హరికృష్ణని ఓ ముఖ్య పాత్రలో పెట్టి ‘సీతారామరాజు’ (Seetharama Raju) అనే సినిమా చేశారు.
నాగార్జున (Nagarjuna) హీరోగా 1999 లో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత వేరే దర్శకుడు ఈయనతో సినిమాలు చేయడానికి ముందుకు రాలేదు. 40 పైన వయసున్న హీరో కావడంతో ఈయనకి ఆఫర్లు ఇవ్వలేదు. అయితే వైవిఎస్ చౌదరి ఈయన్ని ప్రధాన పాత్రలో పెట్టి ‘లాహిరి లాహిరి లాహిరిలో’ అనే సినిమాని రూపొందించారు. 2002 లో ఎటువంటి అంచనాలు లేకుండా ఈ సినిమా రిలీజ్ అయ్యింది.
ఈ చిత్రంతో ఆదిత్య ఓం (Aditya Om) , అంకిత (Ankita)..లు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఆ రోజుల్లో రూ.3.8 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని స్వయంగా వైవిఎస్ చౌదరి తన సొంత బ్యానర్ పై నిర్మించారు. హరికృష్ణతో పాటు సుమన్ (Suman), వినీత్ (Vineeth) వంటి స్టార్లు కూడా నటించినప్పటికీ.. వాళ్ళు కూడా ఆ టైంకి ఫేడౌట్ దశలో ఉన్నారు అని చెప్పాలి. అయినప్పటికీ ఈ సినిమా మౌత్ టాక్ తోనే బాక్సాఫీస్ వద్ద రూ.11 కోట్ల వరకు షేర్ ను కలెక్ట్ చేసింది.
ఇప్పటి లెక్కలు ప్రకారం అయితే ఆ కలెక్షన్స్ రూ.110 కోట్లతో సమానం అనుకోవాలి. ఓ మిడిల్ ఏజ్డ్ హీరోతో ఇలాంటి ఫ్యామిలీ సినిమా తీసి సక్సెస్ సాధించడం అనేది టాలీవుడ్లో ఒక్క వైవిఎస్ చౌదరికి మాత్రమే చెల్లింది.