టాలీవుడ్ లో ఇప్పుడు సీక్వెల్స్, ప్రీక్వెల్స్ ట్రెండ్ జోరుగా నడుస్తోంది. ఈ బాటలో నందమూరి హీరోలు కూడా ఫుల్ బిజీగా ఉన్నారు. బాలకృష్ణ నుంచి ఆయన వారసులు వరకూ కొత్త కథల కంటే, హిట్ సినిమాల కథలను ముందుకు తీసుకెళ్లడంపై ఫోకస్ పెట్టారు. ఈ లైన్‌లో రాబోయే సినిమాలు చూస్తే నందమూరి ఫ్యాన్స్ (Nandamuri Heroes) ఖచ్చితంగా పండగ చేసుకుంటారు. ప్రస్తుతం బాలకృష్ణ (Nandamuri Balakrishna), బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలో అఖండ 2 (Akhanda2) షూటింగ్‌లో ఉన్నారు.
అఖండ ఇచ్చిన సూపర్ హిట్ తర్వాత, ఈ సీక్వెల్ పైన భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలయ్య ఈ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో మరింత గుర్తింపు పొందడం ఖాయమని అంటున్నారు. ఈ సినిమాతో పాటే ఆయన తన కొడుకు మోక్షజ్ఞను ఆదిత్య 999తో లాంచ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఆదిత్య 369 సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాకి బాలయ్య స్వయంగా కథ రాస్తూ, దర్శకత్వం వహిస్తున్నారు. ఇక నందమూరి కల్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) కూడా సీక్వెల్స్, ప్రీక్వెల్స్ లో దూసుకుపోతున్నారు.
ఆయన ఇప్పటికే బింబిసార 2 ప్రీక్వెల్ ను అధికారికంగా ప్రకటించారు. బింబిసార (Bimbisara) విజయం తర్వాత, ఈ ప్రీక్వెల్ పై అంచనాలు భారీగా పెరిగాయి. వశిష్ట్ (Mallidi Vasishta ) విశ్వంభర (Vishwambhara) ప్రాజెక్ట్ పూర్తి చేసుకున్న తర్వాత ఈ ప్రీక్వెల్‌పై పూర్తిగా దృష్టి పెట్టనున్నారు. ఈ సినిమాతో కల్యాణ్ రామ్ మళ్లీ బ్లాక్‌బస్టర్ కొట్టే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఈ లైన్లోనే ముందుకు సాగుతున్నారు. బాలీవుడ్ లో వార్ 2లో నటిస్తున్న తారక్ (Jr NTR) , హృతిక్ రోషన్ తో (Hrithik Roshan) కలిసి స్క్రీన్ పంచుకోనున్నారు.
ఇది వార్ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతోంది. ఈ ప్రాజెక్ట్ ఎన్టీఆర్ కి బాలీవుడ్ ఎంట్రీ మాత్రమే కాకుండా, అంతర్జాతీయ స్థాయి గుర్తింపు కూడా తీసుకురావచ్చు. మొత్తానికి నందమూరి హీరోలు (Nandamuri Heroes) కొత్త కథలకు బదులుగా సక్సెస్‌ఫుల్ ప్రాజెక్టుల సీక్వెల్స్, ప్రీక్వెల్స్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ప్రతి ఒక్కరు తమ స్థాయిని పెంచే విధంగా ఈ సినిమాలను ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ సినిమాలు ఎంతవరకు విజయం సాధిస్తాయో వేచి చూడాలి.