Jr NTR, Manchu Manoj: ఎన్టీఆర్, మనోజ్… అభిమానులే కొండంత అండ..!
- May 20, 2025 / 06:16 PM ISTByPhani Kumar
జూ.ఎన్టీఆర్ (Jr NTR) , మనోజ్ (Manchu Manoj) … ప్యారలల్ లైఫ్స్ కి ఉదాహరణ చెప్పాలంటే వీరినే చూపించవచ్చు. ఎన్టీఆర్ హరికృష్ణ (HariKrishna) కుమారుడు. రెండో భార్య బిడ్డ. మంచు మనోజ్.. మోహన్ బాబు (Mohan Babu) చిన్న కుమారుడు. ఇతను కూడా రెండో భార్య బిడ్డ. వీరిద్దరూ ఒకే సంవత్సరం ఒకే రోజున పుట్టారు. 1983 మే 20న వీరు జన్మించడం జరిగింది. ఇద్దరికీ కూడా మే నెలలో వివాహం జరిగింది. 2011 మేలో ఎన్టీఆర్ కి పెళ్లయింది. 2015 మేలో మంచు మనోజ్ పెళ్లయింది.
Jr NTR, Manchu Manoj

ఎన్టీఆర్ భార్య పేరు ప్రణతి.. అలాగే మనోజ్ మొదటి భార్య పేరు కూడా ప్రణతి. అన్నిటికీ మించి ఎన్టీఆర్- మంచు మనోజ్ ప్రాణ స్నేహితులు. ఎన్టీఆర్ కోసం మనోజ్ గొడవలకి వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయని పలు సందర్భాల్లో అతను చెప్పడం జరిగింది. ఇక హరికృష్ణ చనిపోయిన రోజు ఎన్టీఆర్ కోసం మనోజ్ బాడీ గార్డ్ అవతారం ఎత్తడం కూడా జరిగింది.

దురదృష్టవశాత్తు ఎన్టీఆర్, మనోజ్..ల మధ్య ఉన్న ఇంకో సిమిలారిటీ ఏంటంటే.. ఇద్దరూ కూడా ఫ్యామిలీస్ కి దూరం అవ్వడం. జూనియర్ ఎన్టీఆర్ మొదటి నుండి కుటుంబానికి ఎక్కువగా దూరంగానే ఉంటూ వచ్చాడు. తండ్రి అన్నలకి దగ్గరయ్యాడు అనుకున్న టైంలో పెద్దన్న జానకి రామ్ (Janaki Ram), తండ్రి హరికృష్ణ మరణించడం అతన్ని తీవ్ర విషాదంలోకి నెట్టేసినట్లు అయ్యింది. ఇక మంచు విష్ణు (Manchu Vishnu) కొన్నాళ్లుగా ఫ్యామిలీకి దూరంగా ఉండాల్సి వస్తుంది.

మోహన్ బాబు, మంచు విష్ణు ఇద్దరూ కూడా మనోజ్ ను దూరం పెట్టి వేధిస్తున్న సందర్భాలు చూస్తూనే ఉన్నాం. మొన్నటికి మొన్న ‘భైరవం’ (Bhairavam) ట్రైలర్ లాంచ్ వేడుకలో సైతం మనోజ్ ఎమోషనల్ అయిన సంగతి తెలిసిందే. ఈరోజు మనోజ్, ఎన్టీఆర్ పుట్టినరోజులు సందర్భంగా అభిమానులు ఈ విషయాన్ని కూడా చర్చించుకుంటూ ‘మేము అండగా ఉన్నామంటూ’ కామెంట్లు పెడుతున్నారు.













