మలయాళ సినిమా పరిశ్రమ గురించి ఇన్నాళ్లూ మనకు తెలిసిన విషయాలు వేరు, రీసెంట్‌గా బయటికొచ్చిన విషయాలు వేరు. భావోద్వేగాలు, బ్యూటిఫుల్ ప్రదేశాల నడుమ సినిమాలు అదిరిపోతాయి అని అనుకున్నాం. కానీ మాలీవుడ్ అసలు రంగు ఇది అంటూ జస్టిస్ హేమ కమిటీ ఓ రిపోర్ట్ ఇచ్చింది. అందులో చాలా షాకింగ్ విషయాలు బయటికొచ్చాయి. వామ్మో ఇన్ని సమస్యల మధ్య మాలీవుడ్‌లో హీరోయిన్లు పని చేస్తున్నారా అని ఆశ్చర్యపోతున్నారు. తాజాగా ఈ విషయమై టాలీవుడ్ హీరో నాని (Nani) స్పందించాడు. జస్టిస్ హేమ కమిటీ రిపోర్టు విషయం గురించి తెలిసినప్పుడు నా మనసు ముక్కలైంది.
Nani
నా సెట్స్‌లో, చుట్టుపక్కల ఇలాంటి సంఘటనలు జరగడం నేనెప్పుడూ చూడలేదు. నా చుట్టూ ఉన్నవాళ్లు కాస్త జాగ్రత్తగా ఉంటున్నారు అనుకుంటా. అందుకే నా సినిమా లొకేషన్స్‌లో ఇలాంటి సంఘటనలు జరిగినట్లు ఎప్పుడూ నా దృష్టికి రాలేదు అని నాని చెప్పాడు. సినిమా రంగంలో రాణించాలనే ఆసక్తితో చాలామంది మహిళలు ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు. గతంతో పోలిస్తే ఇండస్ట్రీపై ఆసక్తి చూపించే అమ్మాయిల సంఖ్య ఇప్పుడు పెరిగింది. అందుకే వారు ఈ పరిశ్రమలో రాణించడానికి అనువైన పరిస్థితులు ఉండాలి.
జస్టిస్ హేమ కమిటీ రిపోర్టులో ప్రస్తావించిన అంశాలు చూస్తే.. పరిశ్రమలో పనిచేసే సమయంలో మహిళలకు సరైన టాయిలెట్ సౌకర్యాలు లేవు అని పేర్కొన్నారు. సినిమాల్లో అవకాశం కోసం వచ్చే అమ్మాయిలు / మహిళలకు.. కొందరితో సన్నిహితంగా మెలగాల్సి ఉంటుందని ముందే చెబుతున్నారు.అంగీకరిస్తేనే సినిమాల్లో ఛాన్స్ ఇస్తున్నారు. షూటింగ్ సమయంలో మహిళలు ఉంటే హోటల్ గదుల తలుపులను మద్యం తాగి వచ్చిన పురుషుల తడుతుంటారు. స్టార్‌డమ్ పెరిగే కొద్ది వేధింపులు ఎక్కువవుతాయట.
అంతేకాదు లైంగిక వేధింపులు ఎదుర్కొనే మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు భయపడుతున్నారు. ఇండస్ట్రీలో కొంతమంది నిర్మాతలు, దర్శకులు, నటులు, నిర్మాణ సంస్థల నియంత్రణలో ఉంది. ఇక పారితోషికానికి సంబంధించి అగ్రశ్రేణి నటులు మినహా ఇంకెవరికీ రాతపూర్వక ఒప్పందం ఉండదని కమిటీ గుర్తించింది. మహిళలు, జూనియర్ ఆర్టిస్ట్‌లకు వారి పూర్తి పారితోషికాలు చెల్లించడం లేదని నివేదికలో జస్టిస్ హేమ కమిటీ పేర్కొంది.