ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు వీరంతా తెలుగు చిత్ర పరిశ్రమ తొలి తరం హీరోలు. ఎంతో మంది నటులుగా మారడానికి వీరే ఆదర్శం. అంతేకాదు రెండో తరం హీరోలైన మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్ లు కూడా ఈ తరం హీరోలకు ఇన్సిపిరేషన్. వారి నటన, డ్యాన్స్లు చూసి సినీ రంగంలోకి వచ్చినవారు ఉన్నారు. అలాంటి వారిలో నేచురల్ స్టార్ నాని ఒకరు. సినీ నేపథ్యం లేకపోయినా హీరోగా నిలదొక్కుకున్నారు. వరుసగా డబల్ హ్యాట్రిక్ అందుకున్నారు. అతను తాజాగా నటించిన నిన్నుకోరి మూవీ విజయం సాధించడంతో సోషల్ మీడియా వేదికపై అభిమానులతో ముచ్చటించారు.
చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లలో ఎవరంటే ఎక్కువ ఇష్టం అని నానిని ఓ ఫ్యాన్ అడిగితే అందుకు అతను విక్టరీ వెంకటేష్ అని టక్కున సమాధానం చెప్పారు. చిన్నప్పుడు తాను వెంకటేష్ సినిమాలే ఎక్కువ చూసేవాడిననని, ఇప్పటికీ తన ఆల్ టైం ఫేవరెట్ సినిమాల్లో వెంకీ మూవీసే ఎక్కువ ఉంటాయని వివరించారు. తన సినిమాలు చూసిన జనాలు కొన్నిసార్లు వెంకీతో పోల్చడం సంతోషాన్నిస్తుందని నాని వెల్లడించారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.
