Hero Nani: నాని ని బాగా బయపెట్టేసినట్టున్నారు ..!
- September 15, 2021 / 05:26 PM ISTByFilmy Focus
నేచురల్ స్టార్ నాని వరుసగా సినిమాలు చేసుకుంటూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంటాడు. కాంట్రవర్సీల జోలికి పోకుండా ఉంటారు అనే ముద్ర కూడా గతంలో ఉండేది. కానీ 2018 వ సంవత్సరంలో బిగ్ బాస్ సెకండ్ సీజన్ ను హోస్ట్ చేసినప్పుడు…ఇతని పై భయంకరమైన ట్రోలింగ్ జరిగింది. అది అక్కడి వరకు ఆగలేదు నాని సినిమాలను బ్యాన్ చేస్తాం అనేంతవరకు వెళ్ళింది. దాని దెబ్బకు నాని కోలుకోవడానికి చాలా టైమే పట్టింది. హోస్ట్ గా అతను బాగానే ఎంగేజ్ చేశాడు.
కానీ అంతకు ముందు ఎన్టీఆర్ తో పోల్చి చూడటం … పైగా పక్షపాతం చూపిస్తున్నాడు అంటూ అతన్ని విమర్శించారు ప్రేక్షకులు. అటు తర్వాత సీజన్ 3 ను హోస్ట్ చేసే అవకాశం వచ్చినా నాని ఆ ఆఫర్లను వద్దనుకున్నట్టు ప్రచారం జరిగింది ఇదే విషయం పై నాని ని మరోసారి ప్రశ్నించగా… ‘ నేను జన్మలో హోస్ట్ గా చెయ్యను. ప్రసక్తే లేదు. హోస్ట్ గా చేయడం అనేది చాలా పెద్ద బాధ్యత. యాక్టింగ్ చేసినంత ఈజీ అయితే కాదు.

కానీ నేను హోస్ట్ గా సూట్ అవుతానా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలనిపించింది. ఒకసారి ఎక్స్పీరియన్స్ చేశాను. చాలు. ‘ అంటూ నాని చెప్పుకొచ్చాడు. దీనిని బట్టి అతను చాలా భయపడిపోయినట్టు స్పష్టమవుతుంది.
నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!
Most Recommended Video
టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!














