నేచురల్ స్టార్ నాని (Nani) హీరోగా కీర్తి సురేష్ (Keerthy Suresh) హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం ‘నేను లోకల్’ (Nenu Local). ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ బ్యానర్ పై దిల్ రాజు (Dil Raju) నిర్మించిన ఈ చిత్రానికి త్రినాథ రావ్ నక్కిన (Trinadha Rao) దర్శకుడు. ప్రసన్న కుమార్ బెజవాడ (Prasanna Kumar Bezawada) ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే అందించడం జరిగింది. దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) సంగీతంలో రూపొందిన పాటలు అన్నీ రిలీజ్ కి ముందే చార్ట్ బస్టర్స్ అయ్యాయి. 2017 ఫిబ్రవరి 3 న ఈ సినిమా రిలీజ్ అయ్యింది.
డ్రై సీజన్లో రిలీజ్ అయినప్పటికీ ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. నేటితో ఈ సినిమా రిలీజ్ అయ్యి 8 ఏళ్ళు పూర్తి కావస్తోంది. మరి ఫుల్ రన్లో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంత కలెక్ట్ చేసిందో ఓ లుక్కేద్దాం రండి :
నైజాం
10.65 cr
సీడెడ్
3.30 cr
ఉత్తరాంధ్ర
4.02 cr
ఈస్ట్
2.41 cr
వెస్ట్
1.51 cr
కృష్ణా
2.02 cr
గుంటూరు
1.95 cr
నెల్లూరు
0.82 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
26.68 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా
3.30 cr
ఓవర్సీస్
3.25 cr
టోటల్ వరల్డ్ వైడ్
33.23 cr (షేర్)
‘నేను లోకల్’ (Nenu Local) చిత్రం రూ.20 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. అయితే ఫుల్ రన్లో ఈ సినిమా రూ.33.23 కోట్ల షేర్ ను రాబట్టింది. రూ.13.23 కోట్ల భారీ లాభాలతో ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది.