రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు అంటారు. చూడాలి కానీ ప్రతి రంగంలోనూ ఇలాంటి అశాశ్వత శత్రుత్వం, మిత్రుత్వం కనిపిస్తుంది. అలా సినిమాల్లో కూడా ఇది ఉంటుంది. ఇప్పుడు ఎందుకీ ఉపోద్ఘాతం అనుకుంటున్నారా? ‘తండేల్’ (Thandel) సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ చూశాక ఈ మాట కచ్చితంగా అనిపిస్తుంది. ఇద్దరు సీనియర్ నిర్మాతలు గతంలో జరిగిందంతా మరచిపోయి ఇప్పుడు తిరిగి స్నేహితులు అయిపోయారు. ఆ ఇద్దరు నిర్మాతలు ఎవరో కాదు అల్లు అరవింద్(Allu Aravind), దిల్ రాజు (Dil Raju).
Dil Raju Allu Aravind
‘తండేల్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి నిర్మాత దిల్ రాజు ఓ గెస్ట్‌గా వచ్చారు. ఆయన్ను స్టేజీ మీద మాట్లాడమని అల్లు అరవింద్ చిన్నసైజు ఇంట్రో ఇచ్చి మరీ కోరారు. దానికి దిల్ రాజు మురిసిపోతూ, పొంగిపోతూ నవ్వేసి మాట్లాడారు. ఈ క్రమంలో అల్లు అరవింద్ ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) సినిమాను తక్కువ చేసి మాట్లాడారు అనే ఓ విమర్శ వినిపిస్తోంది. మీరూ చదివే ఉంటారు, చూసే ఉంటారు. ఆయన సినిమా పేరు చెప్పకపోయినా యాక్షన్‌తో అదే చెప్పారు అనుకోండి.
అయితే, ఈ క్రమంలో సైడ్ లైన్ అయిపోయిన మరో విషయాన్ని మీకు చెప్పాలని అనుకుంటున్నాం. అదే గత కొన్ని నెలలుగా టాలీవుడ్‌లో ఉన్న అల్లు అరవింద్ వర్సెస్ దిల్ రాజు. దీనంతటి కారణం ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star) సినిమానే. ‘గీత గోవిందం’ (Geetha Govindam) సినిమా తర్వాత ఆ కాంబినేషన్‌లో మరో సినిమా చేయాలని అల్లు అరవింద్ చాలా ప్లాన్స్ వేశారు. విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) – రష్మిక మందన (Rashmika Mandanna) – పరశురామ్‌ని (Parasuram) కలిపి ఇంకో ప్రాజెక్ట్ కోసం చూశారు.
ఇదిగో, అదిగో అంటూ ప్రాజెక్ట్ గురించి వార్తలొచ్చాయి. అయితే అనూహ్యంగా ఇద్దరి కాంబినేషన్‌లో దిల్ రాజు ఓ సినిమా అనౌన్స్ చేసేశారు. దీంతో అల్లు అరవింద్ హర్ట్ అయ్యారని వార్తలొచ్చాయి. ఈ విషయంలో ప్రెస్ మీట్ పెట్టి మరీ వివరణ ఇస్తారు అని కూడా మీడియాకు సమాచారం ఇచ్చారు. మళ్లీ ఏమైందో రాత్రికి రాత్రి ఆ ప్రెస్ మీట్ ఆలోచన ఆపేశారు. ఆ తర్వాత ఒకరి సినిమా ఈవెంట్‌కి మరొకరు రాలేదు. ఒకరి సినిమా సక్సెస్ మీట్‌కి మరొకరు తప్పక వచ్చే పరిస్థితి నుండి కనీసం పట్టించుకోని పరిస్థితికి వచ్చారు.
దీంతో ఇద్దరు పెద్ద నిర్మాతలు, మంచి స్నేహితులు దూరమైపోయారు అని టాలీవుడ్‌లో మాట్లాడుకునేవారు. అనూహ్యంగా ‘తండేల్’ ఈవెంట్‌కి దిల్ రాజు వచ్చారు. దీంతో ఇద్దరి మధ్య అంతా సమసిపోయిందా? అనే చర్చ మొదలైంది. ఇబ్బంది ఉండి సమసిపోయి ఉంటే దానికి కారణం సంధ్య థియేటర్ ఘటనే అని చెప్పొచ్చు. ‘పుష్ప: ది రూల్’ (Pushpa 2: The Rule) ప్రీమియర్ సందర్భంగా జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో అల్లు అర్జున్ (Allu Arjun) పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో దిల్ రాజు ప్రభుత్వంతో మాట్లాడి ప్రభుత్వానికి, పరిశ్రమకు మధ్య సంధి కుదిర్చారు అని అంటారు.
తొక్కిసలాట, తర్వాత ఘటనలు, కామెంట్లు, విమర్శల నేపథ్యంలో అల్లు అర్జున్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ అయింది. ఈ క్రమంలో ఎఫ్‌డీసీ ఛైర్మన్‌గా దిల్ రాజు రెండు వర్గాల మధ్య సంధి కుదిర్చారు అని టాక్. అలాగే బాధితులకు నష్టపరిహారం విషయంలో కూడా మాట సాయం చేశారు. ఈ క్రమంలోనే అల్లు అరవింద్ – దిల్ రాజు తిరిగి దగ్గరయ్యారు అని అనిపిస్తోంది. ఏదైతే ఏముంది ఇద్దరూ మళ్లీ ఒక్కటయ్యారు. ఒకప్పటిలాగా కలసి సినిమాలు ఏమన్నా నిర్మిస్తారేమో చూడాలి.
అయితే అల్లు అరవింద్ స్టేజీ మీద చెప్పినట్లు తక్కువ స్థాయి సినిమా చేస్తారో, లేక ఎక్కువ స్థాయి సినిమా చేస్తారా అనేది ఇక్కడ పాయింట్. ఎందుకంటే ఈ ఇద్దరూ కలసి గతంలో ఇక్కడ ఎక్కువ స్థాయిలో విజయం సాధించి రికార్డుల సినిమాగా ఉన్న ‘జెర్సీ’ని (Jersey) బాలీవుడ్‌కి తీసుకెళ్లి తక్కువ స్థాయి ఫలితం అందుకున్నారు. ఆ తర్వాత మళ్లీ సినిమాలు చేస్తామని చెప్పినా చేయలేదు. అప్పుడే ‘ఫ్యామిలీ స్టార్’ ఇష్యూ జరిగింది. ఇప్పుడు అన్నీ ఓకే అయ్యాయి కాబట్టి తిరిగి రెండు బ్యానర్ల కాంబినేషన్‌లో సినిమాలు చూడొచ్చేమో.