టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన రాజమౌళి స్టూడెంట్ నంబర్ 1 సినిమా నుంచి ఆర్ఆర్ఆర్ వరకు దర్శకునిగా తన స్థాయిని పెంచుకుంటూ కెరీర్ విషయంలో ముందడుగులు వేస్తున్నారు. రాజమౌళి సినిమాలలో గ్రాఫిక్స్ సన్నివేశాలకు ఉండే ప్రాధాన్యత అంతాఇంతా కాదు. అయితే రాజమౌళి డైరెక్షన్ లో గ్రాఫిక్స్ తో తెరకెక్కిన సన్నివేశాలు న్యాచురల్ గా ఉంటాయి. గ్రాఫిక్స్ తో ఆ సన్నివేశాలను తెరకెక్కించామని వీడియోలు రిలీజ్ చేస్తే తప్ప నమ్మే పరిస్థితి ఉండదు.
తాజాగా బ్రహ్మాస్త్రం ట్రైలర్ రిలీజ్ కాగా ట్రైలర్ లోని గ్రాఫిక్స్ సీన్లను చూసి ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. ఇవేం గ్రాఫిక్స్ సన్నివేశాలు అంటూ నెటిజన్ల నుంచి నెగిటివ్ కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. గ్రాఫిక్స్ సన్నివేశాలు అంటే ఏ విధంగా ఉండాలో బాహుబలి, బాహుబలి2 సినిమాలను చూసి నేర్చుకోవాలంటూ నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో రాజమౌళి మాత్రమే గ్రేట్ అని ఫ్యాన్స్ నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. రాజమౌళి సినిమాలలో గ్రాఫిక్స్ సన్నివేశాలు ఎంతో క్వాలిటీతో ఉంటాయనే సంగతి తెలిసిందే.
రాజమౌళి స్థాయిలో విజువల్ ఎఫెక్ట్స్ ను వినియోగించుకుని సినిమాలను తెరకెక్కించే దర్శకుడు ఇండస్ట్రీలో దాదాపుగా లేడని కామెంట్లు వినిపిస్తున్నాయి. గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ గురించి పెద్దగా అవగాహన లేని వారు సైతం బ్రహ్మాస్త్రంను బాహుబలి సినిమాతో పోల్చి నెగిటివ్ కామెంట్లు చేస్తుండటం గమనార్హం. బ్రహ్మస్త్రం ట్రైలర్ ను కొంతమంది ఢమరుకం సినిమాతో పోల్చి కామెంట్లు చేస్తుండటం గమనార్హం. తెలుగు ప్రేక్షకుల్లో అంచనాలను పెంచడంలో బ్రహ్మాస్త్రం టీమ్ ఘోరంగా ఫెయిలైంది.
రాజమౌళి బ్రహ్మాస్త్రం సినిమాకు సపోర్ట్ అందిస్తున్నా ఈ సినిమా ట్రైలర్ విమర్శలు ఎదుర్కొంటూ ఉండటం గమనార్హం. సినిమా రిలీజ్ కు చాలా సమయం ఉన్న నేపథ్యంలో మేకర్స్ గ్రాఫిక్స్ లో ఏవైనా మార్పులు చేస్తారేమో చూడాల్సి ఉంది. బ్రహ్మస్త్రం టీమ్ జాగ్రత్త పడకపోతే మాత్రం ఈ సినిమా నిర్మాతలు దారుణంగా నష్టపోయే అవకాశాలు ఉంటాయి.