అనిల్ రావిపూడి డైరెక్షన్ లో దిల్ రాజు నిర్మాతగా వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా ఎఫ్3 సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఎఫ్2 సినిమాలోని పాత్రలతో అనిల్ రావిపూడి ఈ సినిమాను తెరకెక్కించడం గమనార్హం. ఇప్పటికే విడుదలైన ఎఫ్3 ట్రైలర్ ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోవడంతో పాటు రికార్డు స్థాయిలో వ్యూస్ సాధిస్తోంది. ఈ సినిమాతో అనిల్ రావిపూడి ఖాతాలో మరో సక్సెస్ చేరినట్టేనని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
కొన్నేళ్ల క్రితం వరకు ప్రముఖ దర్శకుడు శ్రీనువైట్ల కామెడీ కథాంశాలతో స్టార్ హీరోలతో సినిమాలను తెరకెక్కించి సక్సెస్ ను సొంతం చేసుకున్నారు. అయితే శ్రీనువైట్ల సినిమాలలో కొందరు సెలబ్రిటీలను టార్గెట్ చేసి సినిమా పాత్రల ద్వారా సెటైర్లు వేయించేవారు. అయితే ఇప్పుడు అనిల్ రావిపూడి కూడా అదే రూట్ ను ఫాలో అవుతున్నారని తెలుస్తోంది. ఎఫ్3 సినిమాలో వెన్నెల కిషోర్ పాత్ర ద్వారా పాన్ ఇండియా సినిమాలపై అనిల్ రావిపూడి సెటైర్ వేశారు.
గతంలో ఒక సందర్భంలో అనిల్ రావిపూడికి పాన్ ఇండియా సినిమాలకు సంబంధించి ప్రశ్న ఎదురుకాగా తాను వేగంగా సినిమాలు తీస్తానని ఒకే సినిమా కోసం ఎక్కువ సంవత్సరాలు కేటాయించలేనని అనిల్ రావిపూడి వెల్లడించారు. వెన్నెల కిషోర్ పాత్ర పాన్ ఇండియా జూనియర్ ఆర్టిస్ట్ అంటూ చెప్పే డైలాగ్ ఎఫ్3 ట్రైలర్ కు హైలెట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇది పాన్ ఇండియా సినిమాలపై సెటైర్ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
అనిల్ రావిపూడి పాన్ ఇండియా హీరోలను కూడా టార్గెట్ చేసి సినిమాలో సీన్లు పెట్టారా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అనిల్ రావిపూడి ఈ సినిమాతో డబుల్ హ్యాట్రిక్ సాధిస్తానని కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. ఒక్కో సినిమాకు ఈ దర్శకుడు 10 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. అనిల్ రావిపూడి తర్వాత సినిమా బాలయ్య హీరోగా భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.