టాలీవుడ్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా దూసుకుపోతున్న దిల్ రాజు (Dil Raju) సినిమాలు అంటే జనాల్లో ఓ పాజిటివ్ ఫీలింగ్ ఉంటుంది. ట్రేడ్లో కూడా దిల్ రాజు సినిమాలపై అంచనాలు ఎక్కువగా ఉంటాయి. ఆయన క్రియేట్ చేసుకున్న మార్క్ అలాంటిది. ఆయన బ్రాండ్ ఉంటే.. సినిమా హిట్టే అనేది అందరి నమ్మకం. కంటెంట్ పరంగా కూడా దిల్ రాజు ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చే సినిమాలే తీస్తారు అనే అభిప్రాయం కూడా ప్రేక్షకుల్లో ఉంది.
అయితే మెల్ల మెల్లగా ఆయన బ్రాండ్ వాల్యూ తగ్గుతుందేమో అనే అభిప్రాయాలు ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్నాయి. దానికి కారణాలు కూడా లేకపోలేదు. కొన్నాళ్లుగా దిల్ రాజు బ్యానర్ నుండీ వస్తున్న సినిమాలు గమనిస్తే ఈ మార్పు స్పష్టంగా తెలుస్తుంది. ‘థాంక్యూ’ (Thank You) ‘వరిసు'(వారసుడు) (Varisu) ‘ది ఫ్యామిలీ స్టార్’ (Family Star) వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఇంపాక్ట్ చూపలేదు. ‘వారసుడు’ తమిళంలో ఓకే అనిపించినా తెలుగులో పెద్దగా ఆడలేదు.
సహా నిర్మాతగా వ్యవహరించిన ‘శాకుంతలం’ (Shaakuntalam) ఎపిక్ డిజాస్టర్లలో ఒకటిగా మిగిలింది. ‘బలగం’ (Balagam) సినిమా మాత్రమే మంచి బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. ఇదిలా ఉండగా.. తాజాగా రిలీజ్ అయిన ‘లవ్ మీ’ (Love Me) పై కూడా చాలా నెగిటివ్ టాక్ వినిపిస్తుంది. ‘ఇలాంటి కథని దిల్ రాజు ఎలా యాక్సెప్ట్ చేశారు, పైగా ‘ఆర్య’ (Arya) వంటి క్లాసిక్ తో ఎలా పోల్చారు?’ అంటూ ఆయన జడ్జిమెంట్ పై కూడా చాలా మంది విమర్శలు గుప్పిస్తున్నారు.