బాలీవుడ్‌ స్టార్‌ హీరోల సినిమాల్లో ఈ మార్పు గమనించారా?

దేశంలో తెలుగు సినిమా పవర్‌ పెరిగింది. కొన్ని తెలుగు సినిమాలు పాన్‌ ఇండియా స్థాయిలో రాణిస్తున్నాయి. ఆ మాటకొస్తే బాలీవుడ్‌ సినిమాలు కంటే కొంచెం ఎక్కువ వసూళ్లే సాధిస్తున్నాయి. ఈ కారణమో లేక ఇంకొకటో కానీ.. ఇటీవల కాలంలో హిందీ సినిమాల్లో తెలుగు వాళ్లు అంటే తెలుగు సినిమా వాళ్లు కాస్త ఎక్కువగా కనిపిస్తున్నారు. కావాలంటే మీరే చూడండి. ఇటీవల కాలంలో వస్తున్న పుకార్లు, అనౌన్స్‌ అవుతున్న విషయాలు చూస్తే ఇదే విషయం అర్థమవుతోంది.

ముందుగా ఇప్పటికే క్లారిటీ వచ్చిన సినిమాల సంగతి చూద్దాం. సల్మాన్‌ ఖాన్‌ ‘కబీ ఈద్‌ కబీ దివాళీ’ సినిమాలో కీలక పాత్రలో వెంకటేశ్‌ నటిస్తున్న విషయం తెలిసిందే. కొన్ని రోజుల క్రితం సల్మాన్‌, వెంకీ ఇద్దరూ ఈ విషయం ప్రకటించారు. అలాగే ఇందులో మరో ముఖ్య పాత్రలో జగపతిబాబు కనిపించబోతున్నాడు. ఇక అక్షయ్‌ కుమార్‌ ‘రామసేతు’లో సత్యదేవ్‌ ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ఇక ఆమిర్‌ ఖాన్ ‘లాల్‌ సింగ్‌ చద్దా’లో నాగచైతన్య ఓ ముఖ్య పాత్ర పోషించాడు.

షారుఖ్‌ ఖాన్‌ – అట్లీ సినిమాలో రానా నటిస్తున్నాడని వార్తలొస్తున్నాయి. మరోవైపు సల్మాన్‌ ఖాన్‌ కొత్త సినిమా ‘నో ఎంట్రీ 2’లో ఓ హీరోయిన్‌గా సమంత ఉంటుందని సమాచారం. ‘కబీ ఈద్‌ కబీ దివాళీ’లో రామ్‌చరణ్‌ ఓ పాటలో తళుక్కున మెరుస్తాడు అని కూడా చెబుతున్నారు. ఖాన్స్‌, అక్షయ్‌ సినిమాల్లోనే కాకుండా మరికొన్ని సినిమాల్లో ఈ సంప్రదాయం మొదలవ్వబోతోంది అని టాక్‌. ఇప్పటికే తెలుగు నటులు హిందీ సినిమాల్లో చేసినా.. అది అప్పుడప్పుడే.

ముందు చెప్పినట్లు పాన్‌ ఇండియా సినిమాల ప్రభావమో, లేకపోతే ఆయా సినిమాల్లో సౌత్‌ నటుల అవసరం ఉందో కానీ… ‘బాలీవుడ్‌’లో పెద్ద సినిమా అంటే ‘తెలుగు’ ఉండాల్సిందే అనే పరిస్థితి అయితే ఇప్పుడు కనిపిస్తోంది. చూస్తుంటే రాబోయే రోజుల్లో ఈ సంప్రదాయం ఇంకాస్త పెరిగే అవకాశం కూడా ఉంది అని చెప్పొచ్చు. కారణాలేమైనా ప్రేక్షకులకు మాత్రం ఇది కనులపండువే.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Share.