తమన్ (Thaman).. టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా రాణిస్తున్నాడు. వరుస సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాడు. ప్రతి నెల ఇతను సంగీతం అందించిన సినిమా రిలీజ్ అవుతూనే ఉంది. ఈ మధ్య వరుసగా పాన్ ఇండియా సినిమాలకి పనిచేస్తూ వస్తున్నాడు. ఈ సంక్రాంతికి తమన్ సంగీతంలో రూపొందిన 2 సినిమాలు రిలీజ్ అయ్యాయి. అవే ‘గేమ్ ఛేంజర్’ (Game changer), ‘డాకు మహారాజ్’ (Daaku Maharaaj) . ఈ రెండు సినిమాల్లోని పాటల సంగతి ఎలా ఉన్నా.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
Thaman
రెండిటికీ బెస్ట్ బీజీఎం అందించాడు తమన్. అయితే ‘డాకు మహారాజ్’ కి తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగా హైలెట్ అయ్యింది అని చెప్పాలి. బాలకృష్ణ (Nandamuri Balakrishna) సినిమా అనేసరికి తమన్ కి పూనకం వచ్చేస్తుంది అనుకుంట.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదరగొట్టేస్తూ ఉంటాడు. తమన్ – బాలకృష్ణ కాంబినేషన్లో వచ్చిన మొదటి సినిమా ‘డిక్టేటర్’ (Dictator). ఆ సినిమా పెద్దగా ఆడలేదు కానీ దానికి తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం సూపర్.
అటు తర్వాత వీళ్ళ కాంబినేషన్లో ‘అఖండ’ (Akhanda) వచ్చింది. ఆ సినిమాకి బీజీఎం ఎంత బాగా వర్కౌట్ అయ్యిందో అందరికీ తెలుసు. ఆ సినిమా సక్సెస్..లో తమన్ బీజీఎం కీలక పాత్ర పోషించింది అనడంలో సందేహం లేదు. అటు తర్వాత ‘వీరసింహారెడ్డి’ (Veera Simha Reddy) ‘భగవంత్ కేసరి’ (Bhagavanth Kesari) సినిమాలకి కూడా తమన్ అదిరిపోయే బీజీఎం ఇచ్చాడు. వాటికి మించి ఇప్పుడు ‘డాకు మహారాజ్’ కి అద్భుతమైన నేపధ్య సంగీతం ఇచ్చాడు అనడంలో సందేహం లేదు.
అంతేకాదు ‘అఖండ’ టైంలో ఓ థియేటర్లో స్పీకర్లు పాడయ్యాయి అంటూ వార్తలు వచ్చాయి. మళ్ళీ ‘డాకు మహారాజ్’ విషయంలో కూడా అదే కంప్లైంట్ వచ్చింది. అందుకే తమన్ ని ఇప్పుడు నందమూరి అభిమానులు ఆకాశానికెత్తేస్తున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అయితే హీరో బాలయ్య .. తమన్ ని ‘నందమూరి తమన్’ అంటూ ప్రశంసించడం విశేషంగా చెప్పుకోవాలి.