నితిన్ (Nithiin) , శ్రీలీల (Sreeleela) హీరో హీరోయిన్లుగా ‘ఎక్స్ట్రా’ (Extra Ordinary Man) తర్వాత రూపొందిన చిత్రం ‘రాబిన్ హుడ్’ (Robinhood) . వెంకీ కుడుముల (Venky Kudumula) ఈ చిత్రానికి దర్శకుడు. ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఇటీవల టీజర్ విడుదలైంది.. అందులో కామెడీ పార్ట్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్లో ఇంకా ఎక్కువ కామెడీ ఉంటుందని, సినిమాలో వీటికి పది రెట్లు కామెడీ ఉంటుంది అని దర్శకుడు వెంకీ కుడుముల ఇటీవల చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే.
Nithiin
డిసెంబర్ 5న ‘రాబిన్ హుడ్’ విడుదల కానుంది అని ప్రకటించారు. అయితే ఇప్పుడు ఆ డేట్ కి ఈ సినిమా రాకపోవచ్చు అనేది ఇన్సైడ్ టాక్.దానికి కారణం కూడా లేకపోలేదు. అలా అని కేవలం ‘పుష్ప 2’ (Pushpa 2: The Rule) మాత్రమే కాదు. ‘పుష్ప 2’ డిసెంబర్ 5న విడుదల కాబోతుంది.ఆ సినిమాకి భారీగా టికెట్ రేట్లు పెంచేశారు. సో మొదటి వారం ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాని చూసే అవకాశం లేదు.
కానీ నెల ప్రారంభం కాబట్టి.. జీతాలు కరెక్ట్ గా ఇదే టైంలో పడతాయి కాబట్టి, కొంతమంది ఈ సినిమాను వీక్షించే అవకాశాలు ఉన్నాయి. కానీ ఎక్కువ శాతం రెండో వారం, మూడో వారమే చూస్తారు. సరిగ్గా అలాంటి టైంలో ‘రాబిన్ హుడ్’ సినిమా రిలీజ్ అయితే దానిని ఎవరు పట్టించుకుంటారు? నెలాఖరుకి కచ్చితంగా చిన్న, మిడ్ రేంజ్ సినిమాలను ఆడియన్స్ స్కిప్ చేసే అవకాశం ఉంది.
‘రాబిన్ హుడ్’ కి కూడా పెద్దగా బజ్ లేదు. సో ఇలాంటి టైంలో రిలీజ్ అయితే.. పాజిటివ్ టాక్ వచ్చినా ఆ సినిమాని ఆడియన్స్ పట్టించుకోకపోవచ్చు. అందుకే ఈ సినిమాను వాయిదా వేసే పనిలో నిర్మాతలు ఉన్నట్టు ఇన్సైడ్ టాక్.