ప్రశాంత్ నీల్ (Prashanth Neel) – ఎన్టీఆర్ (Jr NTR) కాంబినేషన్ లో తెరకెక్కబోయే భారీ ప్రాజెక్ట్ ‘డ్రాగన్’ పై ఇప్పుడు సినీప్రపంచంలో చర్చ నడుస్తోంది. ఈ సినిమా ఆలస్యం అవుతున్న విషయం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి పలు రకాల రూమర్స్ షికార్లు చేస్తున్నాయి. ఇందులో దర్శకుడిపై అనవసర విమర్శలు వచ్చాయి. కావాలని సంక్రాంతి రిలీజ్ అంటూ ఆడియోన్స్ ను మోసం చేశాడని, ఇది పబ్లిసిటీ స్టంట్ అని అంటున్నారు. కానీ ప్రశాంత్ నీల్ గత రికార్డులు చూస్తే, ఈ మాటలకు అస్సలు స్థానం లేదని స్పష్టమవుతుంది.
‘కేజీఎఫ్’, (KGF) ‘సలార్’ (Salaar) లాంటి బ్లాక్‌బస్టర్ సినిమాలను రూపొందించిన ప్రశాంత్ నీల్‌కి స్టంట్ అవసరం ఉండదనే వాదన బలంగా ఉంది. ఒక పోస్టర్, ఒక లుక్స్ కూడా అభిమానుల్లో విపరీతమైన క్రేజ్ కలిగించే స్థాయిలో ఆయన క్రియేట్ చేసిన బ్రాండ్ వేరు. పైగా, ఇది ఎంటీఆర్ వంటి మాస్ హీరోతో తెరకెక్కే ప్రాజెక్ట్. అలాంటి భారీ సినిమా కోసం డేట్ ఫిక్స్ చేసి వాయిదా వేయడాన్ని పబ్లిసిటీగా చూడటం అన్యాయమే.
ఈ గ్యాప్‌లో ప్రశాంత్ టీం పనిలో తలమునకలై ఉంది. రామోజీ ఫిల్మ్ సిటీలో యాక్షన్ బ్లాక్స్ ప్లాన్ చేయడం, స్క్రిప్ట్‌ను రీ షేప్ చేయడం జరుగుతోంది. మరోవైపు ఎన్టీఆర్ జపాన్ లో ‘దేవర’ (Devara) ప్రమోషన్స్, ‘వార్ 2’ షూటింగ్స్‌తో బిజీగా ఉన్నాడు. వీటన్నింటినీ కోఆర్డినేట్ చేయడం అంత సులువు కాదు. ఆ కారణంగా ‘డ్రాగన్’ డిలే అయినా, సాలీడ్ సినిమా అవుతుంది. ఇక ‘డ్రాగన్’ ఓ రెగ్యులర్ సినిమా కాదు. స్కేల్, విజన్ పరంగా ఇది ఒక భారీ ప్రయత్నం.
కాబట్టి అంత త్వరగా కంప్లీట్ చేయడం సాధ్యం కాదు. ప్రశాంత్ నీల్ టేకింగ్ తెలిసినవారికి ఇది అర్థమవుతుంది. కేజీఎఫ్ 2 ఆలస్యం అయినా, రిలీజ్ తర్వాత ఎలాంటి రికార్డ్స్ బద్దలయ్యాయో అందరికీ తెలుసు. కాబట్టి ఆలస్యం జరిగిందని అంతేలోనే దర్శకుడిపై నిందలు వేయడం అనవసరం. ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ ఇద్దరూ మాస్ రేంజ్‌ను కొత్త ఎత్తుకు తీసుకెళ్లే కాంబో. వీరిద్దరూ కలిసి తెచ్చే సినిమా ఎప్పుడొచ్చినా, ఆ క్వాలిటీ, కంటెంట్ మాత్రం నెత్తిన పెట్టుకుంటారు. మరి ఆ రోజు ఎంత దూరంలో ఉందో వేచి చూడాల్సిందే.