మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) , బి.గోపాల్ (B. Gopal) కాంబినేషన్ లో తెరకెక్కిన ఇంద్ర (Indra) మూవీ అప్పట్లో బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించగా రీరిలీజ్ లో సైతం ఈ సినిమా సంచలనం సృష్టించింది. ఈ సినిమా ఇప్పటివరకు ఏ సినిమా రీరిలీజ్ కానన్ని థియేటర్లలో రీరిలీజ్ అయిందని భోగట్టా. 385కు పైగా థియేటర్లలో ఈ సినిమా రీరిలీజ్ అయినట్టు సమాచారం అందుతోంది. ఇంద్ర సినిమా రీరిలీజ్ లో సరికొత్త రికార్డ్ సెట్ చేసింది. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో సైతం ఈ సినిమా రీరిలీజ్ అయిందని భోగట్టా.
Indra
మరోవైపు ఇంద్ర మూవీ రీరిలీజ్ అయిన ఒక థియేటర్ లో ఓ పెద్దాయన తోటి ప్రేక్షకులతో కలిసి అయ్యయ్యయ్యో సాంగ్ కు అదిరిపోయే స్టెప్పులు వేసి తన డ్యాన్స్ తో ఫిదా చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా ఆ పెద్దాయన ముసలోడే కానీ మహానుభావుడు అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఆ వ్యక్తితో కలిసి తాను సినిమా చూశానని ఆ వ్యక్తి చిరంజీవి అంటే ఎంతో ఇష్టమని చెప్పాడని మరో వ్యక్తి సోషల్ మీడియా పోస్ట్ లో చెప్పుకొచ్చారు.
ఈ వీడియో నెట్టింట తెగ హాట్ టాపిక్ అవుతుండటం గమనార్హం. పెద్దాయన ఎనర్జీ లెవెల్స్ ను చూసిన నెటిజన్లు సైతం ఆశ్చర్యానికి గురవుతున్నారు. చిరంజీవి బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్ లతో కెరీర్ పరంగా బిజీ అవుతున్న సంగతి తెలిసిందే. చిరంజీవి రెమ్యునరేషన్ పరంగా కూడా టాప్ లో ఉన్నారు. విశ్వంభర (Vishwambhara) సినిమా నుంచి చిరంజీవి పుట్టినరోజు కానుకగా పోస్టర్ విడుదల కాగా ఈ పోస్టర్ బాగుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
పంచ భూతాల కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తోంది. విశ్వంభర సినిమా యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతోంది. కీరవాణి (M. M. Keeravani) ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. 2025 సంవత్సరం జనవరి 10వ తేదీన విశ్వంభర సినిమా థియేటర్లలో విడుదల కానుంది.