దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి చిత్రాలు తెలుగు చిత్ర పరిశ్రమకే కాదు.. భారత దేశంలోని అన్ని చిత్ర పరిశ్రమల వారికీ స్ఫూర్తిగా నిలిచాయి. తెలువారి ప్రతిభని ప్రపంచానికి చాటాయి. అనేక అవార్డులు అందుకొని, వివిధ ప్రపంచ వేదికలపై ప్రదర్శనకు నోచుకోని ప్రతి తెలుగోడు గర్వించదగ్గ విధంగా చేసిన ఈ సినిమాలు… మరోమారు మనల్ని గర్వించేలా చేశాయి. ఈనెల 20 నుంచి 28 వరకు గోవా లో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ జరగనుంది. ఈ చిత్రోత్సవంలో ప్రదర్శించే సినిమాల జాబితాని కమిటీ ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉత్తమమైన 26 సినిమాలు ఇండియన్ పనోరమ-2017 కు సెలక్ట్ అయ్యాయి.
వీటిలో అత్యధికంగా (8 ) మరాఠీ భాషవి సెలక్ట్ కావడం విశేషం. బాలీవుడ్ చిత్రాలు నాలుగు ఎంపిక అయ్యాయి. అయితే దక్షిణాది చిత్రపరిశ్రమలకు సంబంధినవి నాలుగు మాత్రమే సెలక్ట్ అయ్యాయి. ఒక్కో భాషకు చెందిన ఒక్కో చిత్రం ప్రదర్శించనున్నారు. టాలీవుడ్ నుంచి ఆ అవకాశం బాహుబలి కంక్లూజన్ దక్కింది. ఈ మూవీ కూడా సెలక్ట్ కాకుంటే తెలుగు చిత్ర పరిశ్రమ పరువు పోయేది. ఆ అవమానం జరగకుండా బాహుబలి 2 కాపాడింది.