వెంకటేష్ – త్రివిక్రమ్ (Trivikram) కాంబినేషన్ అనగానే అందరికీ ‘నువ్వు నాకు నచ్చావ్’ (Nuvvu Naaku Nachav) ‘మల్లీశ్వరి’ (Malliswari) వంటి సినిమాలు గుర్తుకొస్తాయి. త్రివిక్రమ్ రైటింగ్ కి సరైన న్యాయం చేసే నటుడు వెంకటేష్ (Venkatesh ) అనేది కొందరి భావన. వెంకీ పండించే కామెడీకి త్రివిక్రమ్ రైటింగ్ చాలా బాగుంటుంది. అందుకే ‘నువ్వు నాకు నచ్చావ్’ ‘మల్లీశ్వరి’ వంటి సినిమాలను ఇప్పటికీ ఎగబడి చూస్తారు ప్రేక్షకులు. వందల సార్లు టెలికాస్ట్ చేసినా.. ఈ సినిమాలకి మంచి టీఆర్పీ రేటింగ్స్ నమోదవుతూ ఉంటాయి. అయితే త్రివిక్రమ్ దర్శకుడిగా మారి 23 ఏళ్ళు అవుతుంది. కానీ ఇప్పటికీ వెంకటేష్ తో అతను సినిమా చేసింది లేదు.
వెంకటేష్ అనే కాదు.. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) , మహేష్ బాబు (Mahesh Babu), అల్లు అర్జున్ (Allu Arjun) వంటి హీరోలను దాటి వేరే హీరోలతో అతను చేసిన సినిమాలు చాలా తక్కువ. ఎన్టీఆర్ తో (Jr NTR) అరవింద సమేత (Aravinda Sametha Veera Raghava), నితిన్ తో (Nithin Kumar) ‘అఆ’ (A Aa), తరుణ్ (Tarun Kumar) తో ‘నువ్వే నువ్వే’ (Nuvve Nuvve). చెప్పుకోడానికి ఇవి మాత్రమే ఉన్నాయి. అయితే త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా ఒక సినిమా చేయాలనేది అభిమానుల కోరిక. వీళ్ళ అభిమానులు మాత్రమే కాదు.. స్టార్ హీరోల అభిమానులు కూడా ఈ కాంబినేషన్లో ఒక సినిమా చూడాలని ఆశపడుతున్నారు. ఆల్రెడీ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది.
2017 చివర్లో వెంకటేష్ పుట్టినరోజు నాడు ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ వారు ఈ ప్రాజెక్ట్ గురించి అనౌన్స్మెంట్ ఇచ్చారు. తర్వాత త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన ‘అజ్ఞాతవాసి’ లో (Agnyaathavaasi) వెంకటేష్ చిన్న క్యామియో కూడా చేశాడు.ఆ సినిమా టైంలో ఈ కాంబో ఫిక్స్ అనుకున్నారు. కానీ అనౌన్స్మెంట్ దగ్గరే ఆగిపోయింది. ఎక్కడ తేడా కొడుతుందో తెలీదు. ఈ ప్రాజెక్టు సెట్ అవ్వడం లేదు. అయితే మళ్ళీ కాంబో ప్రాజెక్ట్ గురించి వార్తలు వస్తున్నాయి. ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) తర్వాత అల్లు అర్జున్..తో త్రివిక్రమ్ ఓ సినిమా చేయాలి.
కానీ మధ్యలో అల్లు అర్జున్… అట్లీ ప్రాజెక్టుని ముందుకు తీసుకెళ్లాడు. కాబట్టి త్రివిక్రమ్ కి కొంత టైం దొరికింది. ఈ గ్యాప్లో అతను ఓ మిడ్ స్కేల్ ప్రాజెక్ట్ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఫ్యామిలీ ఎంటర్టైనర్లు తీయడం త్రివిక్రమ్ కి కొట్టిన పిండి. కానీ వాటిని ఎక్కువగా రిపీట్ చేస్తున్నాడు అనే కంప్లైంట్ కూడా ఉంది. అయితే ఈ షార్ట్ గ్యాప్లో అలాంటి ప్రాజెక్టు మాత్రమే త్రివిక్రమ్ చేయగలరు. అందుకే వెంకటేష్ తో కనుక ప్రాజెక్ట్ సెట్ చేసుకుంటే… త్రివిక్రమ్ పై ఎటువంటి కంప్లైంట్స్ ఉండవు.
ఎందుకంటే ఈ కాంబోలో సినిమా అంటే ఫ్యామిలీ ఎంటర్టైనర్లనే ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. అందుకే వెంకీతో త్రివిక్రమ్ కలిసి ప్రాజెక్టు సెట్ చేసుకునే పనిలో ఉన్నట్లు ఇన్సైడ్ టాక్. చూడాలి మరి ఈసారైనా సెట్ అవుతుందేమో…! మరోపక్క ‘సంక్రాంతికి వస్తున్నాం’ తో (Sankranthiki Vasthunam) రూ.300 కోట్ల షేర్ క్లబ్ లో చేరిన వెంకటేష్.. ఇప్పటివరకు తన నెక్స్ట్ సినిమా ఏంటి అన్నది ప్రకటించలేదు. ఇప్పుడు త్రివిక్రమ్ తో కనుక ఆయన సినిమా సెట్ చేసుకుంటే.. కచ్చితంగా మరో రూ.300 కోట్ల సినిమా తన ఖాతాలో చేరే అవకాశం ఉంటుంది.