రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన చిత్రం RRR. ఈ సినిమా విడుదలై అద్భుతమైన కలెక్షన్లను రాబట్టింది. ఇకపోతే ఈ సినిమాలో ఇద్దరు స్టార్ హీరోలు నటించడంతో అభిమానుల మధ్య పెద్ద వివాదం తలెత్తింది. మా హీరో గ్రేట్ అంటే మా హీరో పాత్ర తక్కువ చేసి చూపించారు అంటూ ఇద్దరు హీరో అభిమానుల మధ్య చిన్నపాటి యుద్ధం జరిగింది. సినిమా చూసిన తర్వాత చాలా మంది ఎన్టీఆర్ అభిమానులు ఎన్టీఆర్ పాత్ర చాలా తక్కువగా ఉందని రామ్ చరణ్ పాత్రను హైలైట్ చేశారంటూ ఆరోపించారు.
ఇలా ఎన్టీఆర్, చరణ్ అభిమానుల మధ్య మాటల యుద్ధం నడిచింది. ఇకపోతే తాజాగా ఆర్మాక్స్ మీడియా సంస్థ ఏప్రిల్ 22 వరకు పాన్ ఇండియా స్టార్ హీరోల టాప్ టెన్ జాబితా విడుదల చేశారు. ఈ జాబితాలో ఎన్టీఆర్ రెండవ స్థానంలో ఉన్న సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే ఈ టాప్ టెన్ జాబితాలో టాప్ ఫైవ్ లో కేవలం బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ మాత్రమే ఉన్నారు. మిగిలిన హీరోలందరూ కూడా సౌత్ ఇండియన్ స్టార్స్ కావడం విశేషం.
ఇక ఈ సర్వేలో భాగంగా టాప్ టెన్ లో రెండవ స్థానంలో ఎన్టీఆర్ వుండగా ఏడవ స్థానంలో రామ్ చరణ్ ఉన్నారు. రామ్ చరణ్ టాప్ ఫైవ్ లో కూడా చోటు సంపాదించుకోలేదు. ఇక వీరిద్దరూ కలిసి నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల కాకపోతే ఈ టాప్ టెన్ జాబితాలో వీరి పేరు బహుశా ఉండేది కాదేమో. ప్రస్తుతం టాప్ టెన్ జాబితాలో వీరి రాంక్ వెనుక ఈ సినిమా ఉందని చెప్పాలి.
ఇక ఈ సినిమా విడుదలైన తర్వాత ఎన్టీఆర్ రెండో స్థానంలో చోటు సంపాదించుకోగా రామ్ చరణ్ ఏడవ స్థానంలో చోటు సంపాదించుకున్నారు. దీన్నిబట్టి చూస్తే ఈ సినిమా క్రెడిట్ మొత్తం ఎన్టీఆర్ కే దక్కిందని తెలుస్తోంది. ఇలా ఎన్టీఆర్ రెండవ స్థానంలో ఉండడంతో ఆయన అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.