Pawan Kalyan: ఆ సీన్ చేయడానికి పవన్ భయపడ్డారా..?
- June 17, 2021 / 01:30 PM ISTByFilmy Focus
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలలలో ఒకరైన పవన్ కళ్యాణ్ కు ప్రేక్షకుల్లో భారీస్థాయిలో క్రేజ్ ఉందనే సంగతి తెలిసిందే. ఎలాంటి పాత్రలోనైనా అద్భుతంగా నటించి మెప్పించే ప్రతిభ పవన్ కళ్యాణ్ సొంతమని చెప్పవచ్చు. అయితే పవన్ ఒక సందర్భంలో సుస్వాగతం మూవీలో ఒక సీన్ చేయడానికి సిగ్గు పడ్డానని, మొహమాటపడ్డానని ఆ సీన్ వల్ల సినిమాలకే దూరం కావాలని అనుకున్నానని పవన్ తెలిపారు. పవన్ కళ్యాణ్ కెరీర్ స్టార్టింగ్ లో సుస్వాగతం అనే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.
బాక్సాఫీస్ దగ్గర ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అయితే ఆ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక సీన్ లో రోడ్డుపై డ్యాన్స్ చేయాలి. ఇన్ డోర్ షూటింగ్ లను ఎక్కువగా ఇష్టపడే పవన్ ఆ సీన్ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డారు. తనకు ఆ సీన్ గురించి వినగానే ఎబ్బెట్టుగా అనిపించిందని పవన్ కళ్యాణ్ వెల్లడించడం గమనార్హం. ఆ సీన్ గురించి వినగానే తనకు పారిపోవాలని అనిపించిందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

అయితే కెరీర్ తొలినాళ్లలో వరుస విజయాలతో స్టార్ హీరోగా ఎదిగిన పవన్ కోట్ల సంఖ్యలో అభిమానులను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం పవన్ అయ్యపనుమ్ కోషియమ్ రీమేక్, క్రిష్ డైరెక్షన్ లో హరిహరవీరమల్లు, హరీష్ శంకర్ డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తున్నారు. ఈ మూడు సినిమాలు భారీ బడ్జెట్లతో తెరకెక్కుతుండగా ఈ సినిమాలతో పవన్ మరిన్ని విజయాలు సొంతం చేసుకుంటారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
Most Recommended Video
బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?
















