టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ లో ఉన్నత స్టార్ హీరోలు మరో ఫ్యామిలీ కి లేదు అనే విషయం తెలిసిందే. టాలీవుడ్ లో 7 మంది స్టార్ హీరోలు ఉంటే, అందులో నలుగురు మెగా కుటుంబానికి చెందిన వారే విశేషం. అంతే కాదు మీడియం రేంజ్ క్యాటగిరీ హీరోలలో కూడా ఈ కుటుంబం నుండి హీరోలున్నారు. ఒక్కమాట లో చెప్పాలంటే ఇండస్ట్రీ లో సగానికి పైగా మొత్తం మెగా ఫ్యామిలీనే ఉంది. వీళ్ళ కుటుంబం లోనే వీళ్లకు పోటీ ఉంటుంది.
ఎంత పోటీ ఉన్నా కూడా ఒకే సీజన్ లో తక్కువ గ్యాప్ తో ఈ కుటుంబం నుండి సినిమాలు విడుదలై పోటీపడేవి కాదు. కానీ ఒక్కసారి మాత్రం మెగాస్టార్ చిరంజీవి మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తక్కువ గ్యాప్ లో సినిమాలను విడుదల చేసుకున్నారు. చిరంజీవి సినిమా పెద్ద హిట్ అయ్యింది, పవన్ కళ్యాణ్ సినిమా ఒక మోస్తారుగా ఆడింది. ఇక అసలు విషయానికి వస్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ‘గుడుంబా శంకర్’ చిత్రం అప్పట్లో భారీ అంచనాల నడుమ సెప్టెంబర్ 10 వ తారీఖున విడుదల అయ్యింది.
విడుదలకు ముందే అద్భుతమైన పాటలు, మరియు మైండ్ బ్లోయింగ్ పోస్టర్స్ తో ఫ్యాన్స్ ని పిచ్చెక్కించేసాడు పవన్ కళ్యాణ్. సినిమా మీద అంచనాలు అమాంతం పెరిగిపోవడం , సీరియస్ సినిమా అని ఆశించి వెళ్తే కామెడీ సినిమా అని తెలుసుకొని ఫ్యాన్స్ హర్ట్ అవ్వడం తో చిత్రానికి నెగటివ్ టాక్ వచ్చింది. కానీ న్యూట్రల్ ఆడియన్స్ లో మాత్రం ఈ సినిమాకి చిన్నగా పాజిటివ్ టాక్ పెరుగుతూ వచ్చింది.
ఇక బాక్స్ ఆఫీస్ వద్ద స్థిరపడే లోపే మెగాస్టార్ చిరంజీవి ‘శంకర్ దాదా MBBS ‘ చిత్రం విడుదలై అద్భుతమైన పాజిటివ్ టాక్ ని తెచ్చుకొని గుడుంబా శంకర్ కి వచ్చే కలెక్షన్స్ మొత్తానికి గండి కొట్టేసింది. ఆ సినిమా విడుదల అవ్వకపోయ్యుంటే, గుడుంబా శంకర్ కమర్షియల్ గా సూపర్ హిట్ అయ్యేది. అలా చిరంజీవి కారణం గా (Pawan Kalyan) పవన్ కళ్యాణ్ సినిమా దారుణంగా దెబ్బతినింది.