Pawan Kalyan, Roja: ప్రతి వెధవతో మాటలు పడుతున్నా.. పవన్ షాకింగ్ కామెంట్స్!
- January 12, 2023 / 08:39 PM ISTByFilmy Focus
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనపై విమర్శలు చేస్తున్న వైసీపీ నేతలపై మరోసారి ఫైర్ అయ్యారు. శ్రీకాకుళం జిల్లాలో యువశక్తి పేరుతో జరిగిన సభలో పవన్ యువతను ఉద్దేశించి మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేశారు. పదేళ్ల పాటు తాను ఒంటరిగానే పోరాడానని నాకు బలం సరిపోతుందని అనిపిస్తే ఒంటరిగానైనా పోటీ చేయడానికి సిద్ధమేనని పవన్ కళ్యాణ్ కామెంట్లు చేయడం గమనార్హం.
గౌరవం తగ్గకుండా పొత్తు కుదిరితే వెళ్తామని కుదరకపోతే ఒంటరిగానైనా పోటీ చేయడానికి సిద్ధమేనని పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికల్లో పొత్తులకు సంబంధించి స్పష్టత ఇచ్చారు. గూండాలు, రౌడీలను ఎలా తన్నాలో నాకు బాగా తెలుసని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. రెండు ముక్కలైన రాష్ట్రాన్ని మూడు ముక్కలుగా చేయాలనే కుతంత్రాలు చేస్తున్నారని పవన్ కళ్యాణ్ కామెంట్లు చేయడం గమనార్హం.

డైమండ్ రాణి అంటూ పవన్ కళ్యాణ్ రోజాపై షాకింగ్ సెటైర్లు వేశారు. రోజాతో కూడా మాటలు పడాలా.. ఛీ నా బతుకు చెడ అంటూ పవన్ కళ్యాణ్ రోజాపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రజల కోసం డైమండ్ రాణిలతో కూడా తిట్టించుకుంటానని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. వెధవలు, సన్నాసులతో కూడా మాటలు పడుతున్నానని పవన్ కామెంట్లు చేశారు. సాటి మనుషుల కోసం జీవించడం గొప్ప విషయంగా భావిస్తున్నానని పవన్ కళ్యాణ్ తెలిపారు.

రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయానని చేసిన విమర్శల విషయంలో తాను ఎప్పుడూ ఫీల్ కాలేదని ఆయన కామెంట్లు చేశారు. చివరి శ్వాస వరకు రాజకీయాలను వదలనని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. పార్టీని నడిపే స్థాయిలో డబ్బు వస్తే సినిమాలు వదిలేయడానికి సిద్ధమని పవన్ కళ్యాణ్ కామెంట్లు చేశారు. జగన్ మూడు ముక్కల సీఎం అని మాట్లాడితే మూడు పెళ్లిళ్లు అంటూ కామెంట్ చేస్తున్నారని పవన్ చెప్పుకొచ్చారు.
8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!
రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

















