Pawan Kalyan: గేమ్ ఛేంజర్.. రంగంలోకి పవన్ కళ్యాణ్?
- November 20, 2024 / 11:10 AM ISTByFilmy Focus
రామ్ చరణ్ (Ram Charan) హీరోగా శంకర్ (Shankar) దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా సినిమా ‘గేమ్ ఛేంజర్’పై (Game Changer) ప్రేక్షకులలో ఆసక్తి మరింత పెరిగిపోతోంది. ఈ సినిమా మొదటి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. నిర్మాత దిల్ రాజు (Dil Raju) అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ టీజర్ విడుదల తర్వాత మంచి బజ్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో రిలీజ్‌కు సంబంధించిన ప్రమోషన్ కార్యాక్రమాలు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
Pawan Kalyan

‘గేమ్ ఛేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడ నిర్వహిస్తారు, ఎవర్ని ముఖ్య అతిథిగా పిలుస్తారు అనే అంశాలు ఇప్పుడు ఫ్యాన్స్ లో బిగ్ డిస్కషన్ గా మారాయి. లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం, దిల్ రాజు ఈ గ్రాండ్ ఈవెంట్‌కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను (Pawan Kalyan) ముఖ్య అతిథిగా పిలవాలని భావిస్తున్నారని తెలుస్తోంది. ఇది నిజమైతే, సినిమాపై అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లే అవకాశం ఉంది.

పవన్ కళ్యాణ్ గత కొంతకాలంగా రాజకీయాలతో బిజీగా ఉండటంతో, సినిమా ఈవెంట్లకు పెద్దగా హాజరుకాలేదు. ఇక ఆయన వస్తే సినిమాపై మంచి హైప్ క్రియేట్ అవుతుందని భావిస్తూ, నిర్మాత దిల్ రాజు పవన్ హాజరయ్యే విధంగా ప్లాన్ చేస్తున్నారనేది అసలు టాక్. ఈ వేడుక కోసం తాడేపల్లి, కాకినాడ, రాజమండ్రి లాంటి పేర్లు చర్చల్లో ఉన్నట్లు తెలుస్తోంది.

రామ్ చరణ్ ఈ సినిమాలో మూడు విభిన్నమైన షేడ్స్ లో కనిపించబోతున్నారు. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లోని పాత్ర పవర్ ఫుల్‌గా ఉండబోతోందని చిత్ర బృందం తెలిపింది. సినిమా కథ సామాజిక అంశాలను చర్చించడానికి మాత్రమే కాకుండా, మంచి సందేశంతో ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుందట. మరి, దిల్ రాజు ప్రణాళికలు ఎంతవరకు వర్క్ అవుట్ అవుతాయో చూడాలి. ‘గేమ్ ఛేంజర్’ సినిమా 2025 సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.

















